సెక్సీగా భయపెడుతూ సన్నీలియోన్..(వీడియో)
ముంబై: ఫోర్న్ స్టార్ సన్నీ లియోన్ 'రాగిణి ఎంఎంఎస్2' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ చూస్తుంటే సన్నీ లియోన్ లాంటి భామల అందాలను సెక్సీగా చూపిస్తూనే....భయపెట్టే సన్నివేశాలతో కూడిన హారర్-థ్రిలర్ అని స్పష్టం అవుతోంది.
వీకెండ్‌లో ఎంజాయ్ చేద్దామని వెళ్లిన ఓ జంట ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు...అనే అంశంతో ఈచిత్రం తెరకెక్కుతోంది. రొమాంటిక్ సీన్లు...దెయ్యాల చూపిస్తూ భయపెట్టే హాలీవుడ్ సినిమాలను పోలి ఈ సినిమా ఉండనుంది. గతంలో వచ్చిన 'రాగిణి ఎంఎంఎస్' చిత్రం మంచి విజయం సాధించిన నేపథ్యంలో దానికి సీక్వెల్‌గా 'రాగిణి ఎంఎంఎస్2' చిత్రాన్ని తెరకెక్కించారు.
రాగిణి ఎంఎంఎస్2 చిత్రాన్ని ఏక్తా కపూర్, శోభా కపూర్ సంయుక్తంగా బాలాజీ మోషన్ పిక్చర్స్, ఎఎల్‌టి ఎంటర్టెన్మెంట్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. భూషణ్ పటేల్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 2011లో వచ్చిన రాగిణి ఎంఎంఎస్ చిత్రానికి కూడా ఆనే దర్శకత్వం వహించారు.
జనవరి 17, 2014న ఈచిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా విడుదలైన ట్రైలర్లో హాట్ అండ్ సెక్సీ సీన్లతో పాటు, భయపెట్టే సీన్లు కూడా ఉండటంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. 3డి ఫార్మాట్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
ఇక్కడున్న ఫోటోను క్లిక్ చేసి 'రాగిణి ఎంఎంఎస్2' ట్రైలర్ వీక్షించండి


Click it and Unblock the Notifications












