సినిమా విడుదలకు ముందే ప్రాఫిట్ లో ఉన్న రాగిణి యంయంయస్
ఎంటర్‌టైన్‌మెంట్, ఐరాక్ ఫిలిమ్స్ సహ నిర్మాణ సంస్థలుగా వ్యవహరిస్తున్న'రాగిణి-యంయంయస్" పేరుతో పవన్ క్రిప్లాని దర్శకత్వంలో ఏక్తా కపూర్ నిర్మిస్తున్న ఈ చిత్రం మే 13 న విడుదల కానుంది. ఒక వైపు ఈ సినిమా హారర్ సినిమా అని, పారానార్మల్ యాక్టివిటీ లా ఉంటుందని కొంతమంది చెప్పుకుంటుండగా మరో వైపు ఇది ఈ మధ్య కాలంలో జరుగుతూ వస్తున్న యంయంయస్ స్కాండల్స్ ఆధారంగా రూపొందించబడిందని మరి కొంత మంది చెప్తున్నారు. ఈ చిత్రానికి మొత్తం24 కెమెరాలు ఉపయోగించినట్టు, ఫేస్ బుక్ ద్వారా 74000 ఫ్యాన్స్ ఇంటరాక్ట్ అయినట్టు ట్విట్టర్ ద్వారా తెలిపింది. అలాగే ఈ మధ్యన ఈ సినిమాకి సంబంధించిన ఒక లీక్డ్ క్లిప్పింగ్ అంతర్జాలంలో రౌండ్స్ చేస్తుంది. ఈ వీడియో చూడ్డానికి ఎవరో సెల్ ఫోన్ లో షూట్ చేసినట్టుగా అనిపించినా రాగిణియంయంయస్ అన్న టైటిల్ చూస్తుంటేనే ఈ సినిమాలో ఇలాంటి కెమెరా టెక్నిక్స్ వాడుండవచ్చనిపిస్తుంది.
మొత్తానికి హిందీ సినిమాలో ప్రయోగాత్మక సినిమాలు వస్తున్నాయనడానికి ఇది ఒక మంచి ఉదాహరణ. కేవలం టెక్నాలజీ మార్పు ఒక్కటే సరిపోదు కదా!కథ కథనాలు కూడా మారాలి. హిందీ లో ఈ మార్పు ఈ మధ్యనే బాగా కనిపిస్తోంది. అయితే యంయంయస్ స్కాడల్స్ లాంటి సెన్సిటివ్ సబ్జెక్ట్స్ ని మనవాళ్ళు ఆదరిస్తారా అంటే అనుమానమే కానీ, ఈ విషయం లో ఏక్తా తెలివైందే అని చెప్పుకోవొచ్చు. చాలా తక్కువ బడ్జెట్ లో ఇలాంటి ప్రయోగాత్మక సినిమాలు తీసినప్పుడు హిందీ సినిమాలకు అంత నష్టమంటూ ఏమీ ఉండకపోవచ్చు.
హిందీ మరియు తెలుగులో ఏకకాంలో నిర్మించిన ఈ చిత్రం తక్కువ బడ్జెట్ తో 1.3కోట్లతో సీనిమా తీసినా దానికి తగ్గప్రాఫిట్ మూవీ రిలీజ్ కు మందే రాబట్టుకోగలిందని సమాచారం.లవ్ సెక్స్ ఔర్ దోఖా, 'తారించే బైట్ (మరాఠి) మరియు 'షోర్ ఇన్ ది సిటి" మొదలైన సినిమాలన్నీ తక్కువ బడ్జెట్ తో రూపొందించబడి మంచి ప్రాఫిట్ లో నడిచాయనడానికి నిదర్శనం.


Click it and Unblock the Notifications











