టీవీ సీరియల్స్ రాణి ఏక్తా కపూర్ హాట్ ఫిల్మ్ రిలీజ్ ఎప్పుడంటే...

By Srikanya

బాలాజీ మోషన్ పిక్చర్స్ పతాకంపై హిందీ, తెలుగు భాషల్లో ఏక్తా కపూర్ ఏక కాలంలో నిర్మించిన 'రాగిణి ఎంఎంఎస్' చిత్రం ఈ నెల 13న విడుదలవుతోంది. రాజ్‌కుమార్ యాదవ్, కైనాజ్ మోతీవాలా ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి పవన్ కృపలానీ దర్శకుడు. ఈ సినిమా గురించి నిర్మాత ఏక్తా మాట్లాడుతూ "నిజ జీవితంలో ఓ ప్రేమ జంట ఎదుర్కొన్న సంఘటనల్ని ఆధారం చేసుకుని ఈ చిత్రాన్ని రూపొందించాం.ఇదొక రొమాంటిక్ థ్రిల్లర్. ముంబయ్, ఢిల్లీలలో జరిగిన వాస్తవ సంఘటనలకు ప్రతి రూపం ఈ చిత్రం. ఎం.ఎం.ఎస్. స్కాండల్ నేపథ్యంలో నడిచే చిత్రం. ప్రతి సన్నివేశం ఎంతో సహజంగా ఉంటుంది. హిందీ, తెలుగు భాషల్లో ఏకకాలంలో షూటింగ్ జరిపాం. మే 13న రెండు భాషల్లో ఒకేసారి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. యూనివర్శల్ కథాంశంతో తయారైన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది'' అని చెప్పారు.ఆల్ట్ ఎంటర్‌టైన్‌మెంట్, ఐరాక్ ఫిలిమ్స్ సహ నిర్మాణ సంస్థలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎస్.డి. బర్మన్, షమీర్ టాండన్, ఫైజన్ హుస్సేన్, అగ్నేల్ బొమన్, బప్పీలహిరి, సినిమాటోగ్రఫీ: త్రిభువన్ బాబు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పవన్ కృపలానీ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X