twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రహ్మాన్ కి ఇష్టం లేకుండా..

    By Staff
    |

    AR Rahman
    నేనప్పుడు బెడ్ మీదనున్నాను..డిహైడ్రేషన్ స్ధితిలో ఉన్నాను..అప్పుడు ఈ సంఘటన జరిగింది. మా వాళ్ళు ఎవరో జయహో గీతాన్ని రాజకీయ ప్రచారం కోసం ఉపయోగిస్తున్నారని చెప్పారు. ఆ పాట ఎన్నికల కోసం వాడటం నాకు ఇష్టం లేదు. అయితే ప్రజలకు సేవ చేయటాన్ని ఇష్టపడతాను. నాకు పాలిటిక్స్ అసహ్యం. అలాగే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా నాకు ఒకటే..అయితే ప్రజలను ఇబ్బంది పెట్టిని ప్రభుత్వాన్ని ఇష్టపడతాను అంటూ రహమాన్ చెప్పుకొచ్చారు. ఈ ఇంటర్వూ CNNలో మే ఇరవై న ప్రసారం కానుంది. అలాగే మే 21, మే23 తేదీలలో కూడా తిరిగి ప్రాసారమవుతుంది.

    ఇక మనదేశానికి ఆస్కార్ తెచ్చిపెట్టిన జయహో గీతం రైట్స్ ని కాంగ్రెస్‌ సొంతం చేసుకుంది. ఈ మేరకు టీసీరీస్‌ సంస్థ నుంచి హక్కులు కూడా పొందినట్లు ఓ సీనియర్‌ కాంగ్రెస్‌ నేత మీడియాకు తెలిపారు. దాంతో బాలీవుడ్‌ నుంచి హాలీవుడ్‌ దాకా హోరెత్తిపోతున్న 'జయ హో' గీతం ఇకపై కాంగ్రెస్‌ శిబిరంలో విజయ గీతమై పల్లవించింది. తమ పాలన సామాన్యుడికోసం జరిగిందని వారు ఈ గీతం ద్వారా చెప్పటానికి ప్రయత్నం చేసారు.

    అంతర్జాతీయంగా పాపులర్ అయి సినీ ప్రపంచంలో సంచలనాలు సృష్టిస్తున్న 'స్లమ్‌ డాగ్‌ మిలీయనీర్‌' చిత్రం కోసం రెహమాన్‌ స్వరపరిచిన ఈ పాటను రైట్స్ తీసుకోవటంపై కాంగ్రెస్‌ నేతలు ఆనందం వ్యక్తం చేసారు. కానీ రహ్మాన్ మాత్రం చాలా అసంతృప్తిగా ఉన్నారు. అలాగే ఈ పాటను ఎన్నికల్లో ప్రత్యర్థి కూటములపై శక్తివంతమైన ప్రచారాయుధంగా సంధించే ప్రయత్నం చేసారు. ఇలా స్లమ్ డాగ్ విజయాన్ని తమ విజయంగా మార్చుకునే ప్రయత్నాన్ని కాంగ్రెస్‌ ముమ్మరం చేసింది. గతంలో గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌ పార్టీ చక్‌దే పాటను తమ ప్రచారగీతంగా ఎంచుకున్న సంగతి తెలిసిందే.

    అలాగే రహ్మాన్ తన తదుపరి ప్రాజెక్టుల గురించి చెప్పుకొచ్చారు. హాలీవుడ్ నుంచి చాలా ఆఫర్స్ వస్తున్నాయి. కొన్ని అమెరికన్ సినిమాలే కాక ఆశ్చర్య పరిచే విశేషాలు ఉన్నాయి. కన్ఫర్మ్ కాగానే చెప్తాను..అది చాలా పెద్ద విశేషం అయ్యే అవకాశం ఉంది అన్నారాయాన.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X