హాలీవుడ్ మెగా దర్శకుడుతో ఎఆర్ రహమాన్

By Srikanya

హాలీవుడ్ మెగా డైరక్టర్ గా పేరున్న స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ చిత్రానికి త్వరలో ఎ ఆర్ రహమాన్ సంగీతం అందించనున్నారు. స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్రంతో ఆస్కార్ అందుకుని ప్రపంచం దృష్టిని ఆకర్షించిన రహమాన్ ఈ అరుదైన అవకాశాన్ని పొందారు. స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ కి సంబంధించిన డ్రీమ్‌వర్క్‌ స్టూడియోస్‌ నిర్మించే ఆంగ్ల చిత్రం 'వెల్‌కమ్‌ టు పీపుల్‌' చిత్రానికి రెహమాన్‌ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ స్క్రీన్‌ప్లే రచయిత అలెక్స్‌ కర్ట్జ్‌మన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈయన మిషన్‌ ఇంపాజిబుల్‌, ట్రాన్స్‌ఫార్మర్స్‌ లాంటి చిత్రాలకు స్క్రీన్‌ప్లే సమకూర్చారు.

'వెల్‌కమ్‌ టు పీపుల్‌'కి సంగీతం అందిస్తున్న విషయాన్ని రెహమాన్‌ ధ్రువీకరించారు. ''భావోద్వేగాలతో కూడుకున్న కథ. వచ్చే యేడాది ఈ చిత్రం విడుదలయ్యే అవకాశాలున్నాయి. దీని వెనుక ఉన్నది స్పీల్‌బర్గ్‌. ఆయన ఈ కథపై ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారని అన్నారు. రీసెంట్ గా రాక్ స్టార్ చిత్రానికి సంగీతం అందించిన ఎ ఆర్ రహమాన్ ...చెన్నై ఎక్సప్రెస్, మంకీస్ ఆఫ్ ముంబై,వెల్ కమ్ పీపుల్, ఏక్ దీవానా ధా, రానా చిత్రాలకు సంగీతం అందించటానికి కమిటయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X