twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    క్లీన్ షేవ్ చేసుకోవాలంటూ బాలయ్య హీరోయిన్ ...

    By Srikanya
    |

    Neha Dhupia
    ముంబై‌: బాలకృష్ణ...పరమ వీర చక్ర చిత్రంలో చేసిన బాలీవుడ్ శృంగార తార నేహా ధూపియా గుర్తుందా. ఆమె ఇప్పుడు పొలిటీషియన్స్ కు గ్లామర్ పాఠాలు చెబుతోంది. కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ గడ్డం గీసుకొంటే అందంగా కనిపిస్తారని బాలీవుడ్‌ నటి, మాజీ మిస్‌ ఇండియా నేహాధూపియా పేర్కొన్నారు. ఆయన గడ్డం పెంచినపుడుకన్నా గీసినపుడే బాగా కనిపిస్తారని ఆమె పేర్కొన్నారు.

    ఈ మేరకు ఆమె ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ..'' రాహుల్‌ నున్నగా గడ్డం చేసుకొన్నపుడు చూడాలని ఉంది. ఎందుకంటే ఆయన అలా అందంగా కనిపిస్తారు. భాజపా ప్రధాన మంత్రి అభ్యర్థి మోడీ గడ్డంలో కనిపించడం ప్రస్తుతం సాధారణమైపోయింది. రాహుల్‌ మోడీకన్నా చిన్నవారు కనుక గడ్డం గీస్తేనే అందంగా కనిపిస్తారు.'' అని తెలిపారు.

    అలాగే ఈ మధ్య హీరోయిన్లు అవసరం ఉన్నా, లేకున్నా బికినీలు వేసుకుని సినిమాల్లో కనిపించడం మామూలై పోయిందని ఆమె అంటోంది. దర్శక నిర్మాతలు దాన్నో కమర్షియల్ అంశంగా భావిస్తున్నారని, ఇటువంటి కథనాలకు మీడియా కూడా ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోందని, కథ లేకుండా ఎన్నిసార్లు బికినీలు వేసుకుని తెరపై శృంగారం ఒలకబోసినా శ్రమ వృధానే అవుతుదని ఆమె అంటోంది.

    ఖయామత్ సినిమాలో తాను రెచ్చిపోయి బికినీలో అందాలు ఆరబోసినా ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోకపోవడాన్ని ఆమె నెమరేసుకుంది. మీరు ఇంత పాపులారిటీ తెచ్చిన సినిమా ఏదని అడిగితే జూలీ అని టకీమని చెప్పేసింది. ఇప్పటికీ తనను జూలీ పాపగా గుర్తు పట్టి ఆదరిస్తున్నారట. నేహా ధూపియాకు అంత పాపులారిటీ తెచ్చిన జూలీకి అప్పట్లో ఎ సర్టిఫికెట్ వచ్చింది. తెలుగులో నేహా ధూపియా రాజశేఖర్ సరసన విలన్ సినిమాలో చేసింది. కానీ ఎవరికీ పెద్దగా గుర్తు లేదు. అలాగే బాలకృష్ణ సరసన ఆమె పరమవీర చక్ర చిత్రంలోనూ చేసింది.

    English summary
    
 Actress Neha Dhupia has a piece of advice for Congress vice-president Rahul Gandhi -- to sport a clean-shaven look rather than his rugged one."Rahul has donned many looks in the past. But I would like to see him in a clean-shaven look because he looks good in it. Modi's look has become common now. Since Rahul is younger to him, so he can have the suave look," she said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X