Don't Miss!
- News ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
క్లీన్ షేవ్ చేసుకోవాలంటూ బాలయ్య హీరోయిన్ ...
ఈ మేరకు ఆమె ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ..'' రాహుల్ నున్నగా గడ్డం చేసుకొన్నపుడు చూడాలని ఉంది. ఎందుకంటే ఆయన అలా అందంగా కనిపిస్తారు. భాజపా ప్రధాన మంత్రి అభ్యర్థి మోడీ గడ్డంలో కనిపించడం ప్రస్తుతం సాధారణమైపోయింది. రాహుల్ మోడీకన్నా చిన్నవారు కనుక గడ్డం గీస్తేనే అందంగా కనిపిస్తారు.'' అని తెలిపారు.
అలాగే ఈ మధ్య హీరోయిన్లు అవసరం ఉన్నా, లేకున్నా బికినీలు వేసుకుని సినిమాల్లో కనిపించడం మామూలై పోయిందని ఆమె అంటోంది. దర్శక నిర్మాతలు దాన్నో కమర్షియల్ అంశంగా భావిస్తున్నారని, ఇటువంటి కథనాలకు మీడియా కూడా ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోందని, కథ లేకుండా ఎన్నిసార్లు బికినీలు వేసుకుని తెరపై శృంగారం ఒలకబోసినా శ్రమ వృధానే అవుతుదని ఆమె అంటోంది.
ఖయామత్ సినిమాలో తాను రెచ్చిపోయి బికినీలో అందాలు ఆరబోసినా ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోకపోవడాన్ని ఆమె నెమరేసుకుంది. మీరు ఇంత పాపులారిటీ తెచ్చిన సినిమా ఏదని అడిగితే జూలీ అని టకీమని చెప్పేసింది. ఇప్పటికీ తనను జూలీ పాపగా గుర్తు పట్టి ఆదరిస్తున్నారట. నేహా ధూపియాకు అంత పాపులారిటీ తెచ్చిన జూలీకి అప్పట్లో ఎ సర్టిఫికెట్ వచ్చింది. తెలుగులో నేహా ధూపియా రాజశేఖర్ సరసన విలన్ సినిమాలో చేసింది. కానీ ఎవరికీ పెద్దగా గుర్తు లేదు. అలాగే బాలకృష్ణ సరసన ఆమె పరమవీర చక్ర చిత్రంలోనూ చేసింది.