twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వైరల్: కాంగ్రెస్ ఓటమితో కంగుతిన్న దర్శకుడు! చేసేది లేక చివరకు ఈ పని చేసేశాడు

    |

    కొన్ని సందర్భాలు ఊహించని మార్పు తీసుకొస్తాయి. ఆ మార్పు తమకు అనుకూలంగా లేకుంటే తామే దానికి అనుకూలంగా మారాల్సిన పరిస్థితి వస్తుంటుంది. తాజాగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బయోపిక్ విషయంలో ఇలాంటి పరిణామమే చోటుచేసుకుంది. కాంగ్రెస్ గెలుస్తుంది.. తన సినిమా ఆడుతుంది అని భావించిన రాహుల్ గాంధీ బయోపిక్ తీస్తున్న దర్శకుడు తీరా కాంగ్రెస్ ఓడిపోగానే తన సినిమా పేరును మార్చేయడం హాట్ టాపిక్‌గా మారింది.

    బయోపిక్‌ల హవా నడుస్తున్న ఈ తరుణంలో 'మై నేమ్ ఈజ్ రాగా' అనే పేరుతో రాహుల్ గాంధీ బయోపిక్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి రూపేశ్ పాల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రాహుల్ గాంధీ పాత్రను అశ్వినీ కుమార్ పోషిస్తున్నారు. రాహుల్ గాంధీ కుటుంబం, ఆయన బాల్యం, విదేశాల్లో చదువులు నాయనమ్మ, తండ్రి హత్యలు, ఆ తర్వాత ఆయన పొలిటికల్ ఎంట్రీ తదితర విషయాలను ఈ సినిమాలో చూపించబోతున్నారు. కొద్దీ రోజుల క్రితమే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక సినిమా విడుదల అవుతుందన్న టైమ్ లో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో దీని విడుదలను ఆపేసింది ఎలక్షన్ కమీషన్.

    Rahul Gandhis Biopic name changed by director Rupesh paul

    ఇక ఇప్పుడు ఎలెక్షన్స్ ముగిసి ఫలితాలు కూడా వెలువడిన నేపథ్యంలో ఈ సినిమాను విడుదల చేయాలని భావిస్తోంది చిత్ర యూనిట్. కాకపోతే సినిమా పేరును మారుస్తూ తాజాగా సంచలన నిర్ణయం తీసుకోవడం సెన్సేషన్ అవుతోంది. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నో అంచనాలతో బరిలోకి దిగింది రాహుల్ గాంధీ నేతృత్వం లోని కాంగ్రెస్ పార్టీ. తీరా ఫలితాలు చూస్తే.. ఊహించని విధంగా ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది. దీంతో ప్రస్తుత పరిణామాలకు అనువుగా 'మై నేమ్ ఈజ్ రాగా' సినిమా పేరును కాస్త 'రాగా- ద ఫాలెన్ స్టార్' అని మార్చేసింది చిత్రయూనిట్. అంతేకాదు సినిమాకు సంబంధించిన కథలో కూడా కొన్ని మార్పులు చేస్తున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు స్వయంగా వెల్లడించడంతో ఈ టాపిక్ సంచలనంగా మారింది.

    Read more about: rahul gandhi rupesh paul
    English summary
    Rahul Gandhi biopic My Name is RaGa is to ready for release. But the movie name as changed by Rupesh Paul.. latest news says
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X