శేఖర్ కమ్ముల గారు రికమెండ్ చేశారు

By Srikanya

వరస ఫ్లాపులు సిద్దార్ధ కెరీర్ కి బ్రేక్ వేస్తున్నాయి. సిద్దార్ద హీరోగా 'ఆవకాయ్ బిర్యాని' ఫేమ్ అనీశ్ కురువిల్లా డైరెక్షన్‌లో ఓ సినిమా ప్లాన్ చేసారు. అయితే ఇప్పుడా సినిమాలో సిద్దార్దని కాదనుకుని 'హ్యాపీడేస్' రాహుల్ కి ఛాన్స్ ఇచ్చారు. ఈ విషయం రాహుల్ చెపుతూ..త్వరలో 'ఆవకాయ్ బిర్యాని' ఫేమ్ అనీశ్ కురువిల్లా డైరెక్షన్‌లో మల్టీస్టారర్ చెయ్యబోతున్నా. ఈ ఏడాది ఆఖరులోగా లేదా వచ్చే ఏడాది మొదట్లో అది ఉండొచ్చు. ఆ సినిమాకి శేఖర్ కమ్ముల గారు నన్ను రికమెండ్ చేశారు. అనీశ్ కథ చెప్పారు. అది సమకాలీన అర్బన్ థ్రిల్లర్. ఆ సినిమా ప్రారంభం కోసం ఎదురుచూస్తున్నా అన్నారు.

అలాగే రాహుల్ ప్రస్తుతం తమిళంలో 'ఉయిర్ మోళి' (ఆత్మ భాష) అనే చిత్రంలో సోలో హీరోగా చేస్తున్నాడు. భారీ నిర్మాణ సంస్థ మీడియా వన్ నిర్మిస్తున్న ఈ సినిమాకి మనోరాజా డైరెక్టర్. 2012 జనవరిలో ఈ సినిమా రిలీజవుతుంది. సిద్దార్ద విషయానికి వస్తే దిల్ రాజు నిర్మిస్తున్న ఓ మై ప్రెండ్ చిత్రంలో హీరోగా చేస్తున్నాడు.హన్సిక,శృతిహాసన్ హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రం ద్వారా వేణు శ్రీరామ్ అనే దర్శకుడు పరిచయమవుతున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X