For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Rahul Ramakrishna: గాంధీపై టాప్ కమెడియన్ వివాదాస్పద వ్యాఖ్యలు.. మందు దొరక లేదంటూ కామెంట్

  |

  రీల్ లైఫ్ వేరు.. రియల్ జీవితం వేరు. సినిమాల్లో వారు పోషించిన పాత్రలను బట్టి బయట సెలబ్రిటీలు ఉండకపోవచ్చు. కొందరు ఉండవచ్చు కూడా. ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సంచలనాలకు మారుపేరు అని తెలిసిన విషయమే. ఆయన చేసే వ్యాఖ్యలు ఎంతటి వివాదాస్పదం అవుతాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇదే బాటలో పలువురు సెలబ్రిటీలు నడుస్తున్నట్లు అనిపిస్తుంది. టాప్ కమెడియన్ గా రాహుల్ రామకృష్ణ టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్నాడు. కానీ, ఇటీవల కాలంలో ఆయన చేసే వ్యాఖ్యలు కాంట్రవర్సీ అవుతున్నాయి. ఇప్పుడు తాజాగా ఆయన చేసిన ఓ కామెంట్ హాట్ టాపిక్ గా మారింది.

   కమెడియన్ గా గుర్తింపు..

  కమెడియన్ గా గుర్తింపు..

  తెలుగు చిత్రసీమలో తెలంగాణ నుంచి మంచి నటుడు, కమెడియన్ గా గుర్తింపు పొందాడు రాహుల్ రామకృష్ణ. అనతికాలంలోనే కమెడియన్ గా ఒక ప్రత్యేక స్థానాన్ని గెలుచుకున్నాడు. రాహుల్ రామకృష్ణ మొదటగా తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన సైన్మా అనే షార్ట్ ఫిలిం ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత జయమ్ము నిశ్చయమ్మురా అనే సినిమాతో టాలీవుడ్ వెండితెరపై కనిపించాడు.

   అర్జున్ రెడ్డి మూవీలో..

  అర్జున్ రెడ్డి మూవీలో..

  ఈ సినిమాలో మంచి నటునతో ఆకట్టుకున్నాడు రాహుల్ రామకృష్ణ. ఆ తర్వాత రౌడీ హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ సందీప్ వంగా దర్శకత్వంలో వచ్చిన మాసీవ్ హిట్ అర్జున్ రెడ్డి మూవీలో కీలక పాత్ర పోషించాడు. ఈ సినిమాలో హీరోకు ఫ్రెండ్ గా నటించి అద్భుతమైన నటన కనబర్చాడు. ఈ చిత్రంతోనే ఆయనకు చాలా పాపులారిటీ వచ్చింది. ఈ ఫేమ్ తో వరుసపెట్టి సినిమాలతో దూసుకుపోతున్నాడు రాహుల్ రామకృష్ణ.

  సినిమాలతో ఫుల్ బిజీ..

  సినిమాలతో ఫుల్ బిజీ..

  ఈ క్రమంలోనే దగ్గుబాటి రానా, సాయి పల్లవిలు జంటగా నటించిన విరాట పర్వం, మాస్ మహారాజ్ రవితేజ యాక్ట్ చేసిన రామారావు ఆన్ డ్యూటి వంటి చిత్రాలతో ఆకట్టుకున్నాడు. రామారావు ఆన్ డ్యూటీలో చిన్నపాటి నెగెటివ్ పాత్ర పోషించి ఆకట్టుకున్నాడ రాహుల్ రామకృష్ణ. అయితే సినిమాలతో ఫుల్ బిజీగా ఉండే రాహుల్ రామకృష్ణ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటాడు.

  మహాత్మ గాంధీపై కామెంట్..

  మహాత్మ గాంధీపై కామెంట్..

  రాజకీయ, సామాజిక పరమైన విషయాలపై కామెంట్స్ చేస్తూ ఈ మధ్య వార్తల్లో నిలుస్తున్నాడు. ఇక తాజాగా జాతిపిత మహాత్మ గాంధీపై కామెంట్ చేసి ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాడు. అక్టోబర్ 2న గాంధీ జయంతి అని తెలిసిందే. ఈ జయంతి సందర్భంగా అనేక మంది గాంధీ గొప్పదనం గురించి వ్యాఖ్యలు చేస్తుంటారు. కానీ రాహుల్ రామకృష్ణ అందుకు భిన్నంగా స్పందించాడు. ''గాంధీ గొప్పవాడని నేను అనుకోను'' అని రాసుకొస్తూ ట్వీట్ చేశాడు.

   క్షణాల్లో వైరల్..

  క్షణాల్లో వైరల్..

  ఈ ట్వీట్ క్షణాల్లో వైరల్ అయింది. ఇది చూసిన అనేక మంది నెటిజన్లు రాహుల్ రామకృష్ణపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ''ఆయన గ్రేట్ కాదు.. నువ్వే గ్రేట్ అన్నా'' అంటూ తీవ్రంగా ఆగ్రహంగా వ్యక్తం చేశారు. ''ఇవాళ మందు దొరకదు కదా.. అందుకే పిచ్చిలేసి అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు'' అని ఫైర్ అవుతున్నారు. ఇక కొన్ని రాజకీయ పార్టీ నేతలు సైతం రామకృష్ణ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ తప్పుబడుతున్నారు.

   వెనక్కి తగ్గిన రాహుల్ రామకృష్ణ..

  వెనక్కి తగ్గిన రాహుల్ రామకృష్ణ..

  ఈ తీవ్ర విమర్శలతో వెనక్కి తగ్గిన రాహుల్ రామకృష్ణ తన ట్వీట్ డిలీట్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఇదిలా ఉంటే గతంలో కూడా పలుసార్లు రాహుల్ రామకృష్ణ ఇలాంటి వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దమ్ముంటే సినిమా తీయండ్రా ఇడియట్స్ అని ట్వీట్ చేసి ఆ తర్వాత వరుస విమర్శలు పాలయ్యాక వెంటనే డిలీట్ చేశాడు ఈ కమెడియన్. కాగా సోషల్ మీడియాలో నచ్చినట్లు రాయడం, తర్వాత డిలీట్ చేయడం కామన్ అయిపోయిందని పలువురు అనుకుంటున్నారు.

  English summary
  Tollywood Popular Comedian Rahul Ramakrishna Controversial Comments On Mahatma Gandhi. Says I Don't Think Gandhi Was Great.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X