ఆమె కండోమ్‌ని ఎందుకలా చూసింది.. ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ రచ్చ రచ్చ!

ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో అడల్ట్ కంటెంట్ రాజ్యం ఏలుతోంది. డబుల్ మీనింగ్ డైలాగులు, అసభ్య పదజాలం, వల్గర్‌గా ఉండే సన్నివేశాలని సినిమా మొత్తం నింపేస్తూ బోల్డ్ చిత్రాలంటూ జనాలపైకి వదిలేస్తున్నారు. ఈ తరహా చిత్రాలపై విమర్శలు ఎక్కువవుతున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై యంగ్ కమెడియన్స్ రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ఓ సెటైరికల్ వీడియో చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అడల్ట్ కంటెంట్ కంట్రోల్ బోర్డు

అడల్ట్ కంటెంట్ కంట్రోల్ బోర్డు

ఈ వీడియోలో రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కలసి మిఠాయి అనే చిత్రాన్ని రూపొందిస్తారు. ఈచిత్రానికి సెన్సార్ నుంచి అనుమతి లభిస్తుంది. కానీ అడల్ట్ కంటెంట్ కంట్రోల్ బోర్డు అనే సంస్థ మిఠాయి చిత్రానికి అడ్డు చెబుతుంది. ఈ చిత్రంలో ఉన్న అడల్ట్ కంటెంట్ పై ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు కలసిన టీం ఈ చిత్రం గురించి ప్రియదర్శి, రాహుల్ ని విచారిస్తుంది. ఈ విచారణని చాలా ఫన్నీగా రూపొందించారు.

బాత్రూంకు కూడా

బాత్రూంకు కూడా

చెప్పా పెట్టకుంటా యూట్యూబ్ లో ట్రైలర్ ఎందుకు రిలీజ్ చేసారు అని ప్రశ్నిస్తారు. నేను బాత్రూంకి పోవాలన్నా మిమ్మల్ని అడిగిపోవాలా అని ప్రియదర్శి అంటాడు. అసలు ఇలాంటి సినిమాలు తీసి మీరు ఎం చేద్దాం అని అనుకుంటున్నారు. సినిమాకు స్వీట్ పేరు మిఠాయి అని పెట్టి హాట్ హాట్ గా తీశారు. ఈ చిత్రంలో అడల్ట్ కంటెంట్ లేదు. డబుల్ మీనింగ్ డైలాగులు లేవు అని ప్రియదర్శి అంటాడు.

లవర్స్ కాబట్టే

లవర్స్ కాబట్టే

ముద్దులు ఎందుకు పెట్టుకున్నారు.. ఆమె నిరోధ్ ని ఎందుకు అలా చూసింది అనే ప్రశ్నకు ప్రియదర్శి ఫన్నీగా సమాధానం ఇస్తాడు. వాళ్లిద్దరూ లవర్స్ అందుకే ముద్దు పెట్టుకున్నారు. ఆమె డిటెక్టివ్ కాబట్టే కండోమ్ ని అలా పరిశీలించింది అని ప్రియదర్శి అంటాడు. ఆ టీంలో ఇదే ఓ అమ్మాయి అడుగుతూ.. మీరిద్దరూ ప్రతి చిత్రంలో తాగుతూనే కనిపిస్తారా.. ఇక వేరే సన్నివేశాలు మీకు రావా అని అడుగుతుంది. మేము మంచినీళ్లు తాగినా మీరు మీకు అలాగే అనిపిస్తుందా అని ప్రియదర్శి కౌంటర్ ఇస్తాడు.

బూతులు ఎందుకు మాట్లాడుతున్నారు

బూతులు ఎందుకు మాట్లాడుతున్నారు

ప్రియదర్శిని మరో అమ్మాయి ప్రశ్నిస్తుండగా.. మొన్న రాత్రి బాగా తాగేసి రోడ్డుమీద కక్కేసింది మీరే కదా అని ప్రియదర్శి ఆమెకు కౌంటర్ ఇస్తాడు. ఇంతలో మరో వ్యక్తి ఇందంతా కాదు మీరు ఎందుకు బూతులు మాట్లాడుతున్నారు అని ప్రశ్నిస్తాడు. నేనుప్పుడూ బూతులు మాట్లాడాను అంటూనే ప్రియదర్శి బూతుపురాణం అందుకుంటాడు.

ఫన్నీ ట్రైలర్

ఫన్నీ ట్రైలర్


ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ రూపొందించిన మిఠాయి చిత్ర ట్రైలర్ ప్లే అవుతుంది. ట్రైలర్ లో కలలు కంటూ బతుకుతాం అని అంటారు. ఎలాంటి కలలు అవి అని అడల్ట్ కంటెంట్ కంట్రోల్ టీం ప్రశ్నిస్తుంది. ఏం మేము కలలు కనకూడదా అని ప్రియదర్శి అంటాడు. ట్రైలర్ చివర్లో మీరిద్దరూ అరబ్ డ్రెస్ లు వేసుకుని గాడిదలపై వస్తారు. గుర్రాలు దొరకలేదా మీకు అని అనగా.. రాహుల్ రామకృష్ణ సమాధానం ఇస్తాడు. వాస్తవానికి మేము ఆరోజు గుర్రాల కోసం డబ్బులు కట్టాం. కానీ షూటింగ్ సమయానికి అవి పారిపోయాయి అని అంటాడు.

ఆ డైలాగ్ ఏంటి

ఆ డైలాగ్ ఏంటి

ట్రైలర్ లో రాహుల్ రామకృష్ణ బాత్రూంలో కొట్టేసుకున్నా అనే డైలాగ్ ఉంటుంది. అసలు ఏం కొట్టుకున్నారు అని ప్రశ్నిస్తారు. బాత్రూంలో తలకాయ కొట్టుకున్నాడు.. మీకు అవసరమా అని ప్రియదర్శి అంటాడు. డీప్ ఫ్రిజ్ లో ఎం పెట్టారు.. అసలు పెట్టేంత ఏముంది మీ దగ్గర అనే వల్గర్ డైలాగ్స్ ఈ వీడియోలో వినిపిస్తున్నాయి.

సన్నీలియోన్

సన్నీలియోన్

ఈ చిత్రంలో మియా ఖలీఫా అన్నారు. సన్నీలియోన్ ని తీసుకోవచ్చు కదా.. ఇండియావాళ్లని సపోర్ట్ చేసినట్లు ఉంటుంది అని టీం సభ్యుడు అనగానే.. అంత డబ్బు మీరు ఇస్తారా అని ప్రియదర్శి అంటాడు. మీరు మిఠాయి చిత్రంపై ఎలాంటి పంచాయతీలు పెట్టొద్దు. మీరు సినిమా చూడకుండా ఇలా మాట్లాడితే కుదరదు అని ప్రియదర్శి ఫన్నీ వార్నింగ్ ఇస్తాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X