అప్పుడే నన్ను రేప్ చేశారు.. సీక్రెట్స్ అన్నీ చెప్పేయడంతో అంతా షాక్! మూవీ ఆర్టిస్ట్ సంచలనం
టాలీవుడ్ చిత్రసీమలో కొత్త కమెడియన్స్ హంగామా నడుస్తోంది. కామెడీ టైమింగ్, కామెడీ స్టైల్ మారిపోయడంతో అందుకు తగ్గట్టుగా కామెడీ చేస్తూ కొత్త కొత్త కమెడియన్స్ నవ్వుల్లో ముంచెత్తుత్తున్నారు. ఈ కోవలోనే ఆరేళ్ళ క్రితం వెండితెర గడపతొక్కాడు రాహుల్ రామకృష్ణ. కామెడీ చేయడంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన తాజాగా తన జీవితంలో జరిగిన ఓ సంఘటన గురించి చెప్పి షాకిచ్చాడు. వివరాల్లోకి పోతే..

వరుస అవకాశాలు.. మోస్ట్ పాపులర్ కమెడియన్
2014లో ‘సైన్మా' అనే షార్ట్ ఫిలింతో పరిచయమయ్యాడు రాహుల్ రామకృష్ణ. ఆ తర్వాత 2016లో వచ్చిన ‘జయమ్ము నిశ్చయమ్మురా' సినిమాతో నటుడిగా, డైలాగ్ రైటర్‌గా మారి గుర్తింపు సంపాదించిన రాహుల్.. ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుస అవకాశాలు పట్టేస్తూ మోస్ట్ హ్యాపెనింగ్ కమెడియన్‌గా కొనసాగుతున్నాడు.

టాలీవుడ్‌లో మాంచి క్రేజ్.. 'అల.. వైకుంఠపురములో'
పెళ్లిచూపులు సినిమాతో రాహుల్ రామకృష్ణ జాతీయ పురస్కారం కూడా గెలుచుకున్నాడు. ఈ సినిమాలో రాహుల్ రామకృష్ణ రెండు పాటలు కూడా రాయడం విశేషం. ఇక ‘అర్జున్ రెడ్డి' సినిమాతో మాంచి క్రేజ్ సంపాదించిన ఆయన.. ఇటీవల వచ్చిన 'అల.. వైకుంఠపురములో' సినిమాలోనూ ముఖ్యపాత్ర పోషించాడు.

షాకిచ్చిన రాహుల్.. వ్యక్తిగత విషయాలు బయటపెట్టి
రాహుల్ రామకృష్ణ నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. అతని యాస, కామెడీ టైమింగ్ ప్రేక్షకుల చేత నూటికి నూరు మార్కులు వేయించుకుంది. అయితే తాజాగా రాహుల్ తన వ్యక్తిగత విషయాలను బయటపెట్టి షాకిచ్చాడు. తనపై చిన్నప్పుడే రేప్ జరిగిందని తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ట్విటర్ ద్వారా పంచుకోవడంతో ఈ ఇష్యూ చర్చనీయాంశంగా మారింది.

నా చిన్నతనంలో రేప్ జరిగింది
''నా చిన్నతనంలో నేను రేప్‌కి గురయ్యా. నా క్షోభ ఏంటో ఎలా చెప్పాలో తెలియదు. జరిగిన విషయం మాత్రమే తెలుసు. ప్రతిదీ బాధిస్తూనే ఉంటుంది. నా బాధను ఎవరితో ఎక్కడ పంచుకోవాలో తెలీలేదు అందుకే ట్విటర్‌లో పోస్ట్ చేద్దామని అనుకున్నాను. ఇలా ఇతరులతో పంచుకోవడం ద్వారానే నేనేంటో తెలుసుకోగలుగుతున్నాను'' అని పేర్కొంటూ ట్వీట్ చేశాడు.
Recommended Video

RRRలో రాహుల్..
రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న RRR మూవీలో రాహుల్ రామకృష్ణ నటిస్తున్నాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాహుల్ రోల్ కీలకంగా ఉంటుందని సమాచారం. జులై 30న ఈ మూవీ విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











