క్రేజీ డైరెక్టర్‌గా మారిపోయిన రాహుల్ రవీంద్రన్.. నాగ్ ఏం చేశాడో తెలుసా!
అందాల రాక్షసి చిత్రంతో తెలుగులో హీరోగా పరిచయం అయిన రాహుల్ రవీంద్రన్ సడెన్ గా డైరెక్టర్ అవతారం ఎత్తాడు. చిలసౌ చిత్రానికి రాహుల్ దర్శకుడిగా వ్యవహరించడం విశేషం. ఇటీవలే విడుదలైన చిలసౌ చిత్రం హిట్ టాక్ తో దూసుకుపోతోంది. హీరో సుశాంత్ కు ఈ చిత్రం బ్రేక్ ఇచ్చిందని చెప్పొచ్చు.
చిలసౌ చిత్రాన్ని రాహుల్ మొదటి నుంచి ధీమాతో తెరకెక్కించాడు. సుశాంత్ కు జోడిగా రుహాని శర్మ నటించింది. ఎవరూ ఊహించని విధంగా చిలసౌ చిత్రం విజయం సాధించడంతో రాహుల్ క్రేజీ డైరెక్టర్ గా మారిపోయాడు.

రాహుల్ ప్రతిభకు కింగ్ నాగార్జున ఆశ్చర్యపోయినట్లు తెలుస్తోంది. వెంటనే తమ బ్యానర్ అన్నపూర్ణ సుడియోస్ లోనే మరో రెండు చిత్రాలకు రాహుల్ ని నాగార్జున ఒప్పించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు రాహుల్ కి 25 లక్షల అడ్వాన్స్ కూడా ఇచ్చినట్లు చెబుతున్నారు. నెక్స్ట్ మూవీ అక్కినేని హీరోతో ఉంటుందా లేక వేరే హీరోతోనా అనే విషయం తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











