Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
నాగార్జున ఫ్యాన్స్‌కు పండగే.. మతి పోగొడుతున్న కింగ్.. దర్శకుడే లీక్ చేశాడు!
కింగ్ నాగార్జున త్వరలో నటించబోయే చిత్రం మన్మథుడు 2. మన్మథుడు చిత్రానికి సీక్వెల్ గా మన్మథుడు 2ని యువ దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిస్తున్నారు. ఇటీవల మన్మథుడు 2 చిత్ర ప్రారంభోత్సవం జరిగింది. తాజాగా పోర్చుగల్ లో షూటింగ్ కూడా ప్రారంభమైంది. ఈ చిత్ర షూటింగ్ ఎక్కువ భాగం యూరప్ లో జరగబోతోంది. మన్మథుడు చిత్రం నాగార్జున కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ చిత్రాలలో ఒకటి. దీనితో మన్మథుడు 2పై సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది.
మాటల మాంత్రికుడి మ్యాజిక్
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మన్మథుడు చిత్రానికి డైలాగ్స్ రాశారు. ఈ చిత్రంలో కామెడీ పంచ్ లు ఇప్పటికి ప్రేక్షకులని కడుపుబ్బా నవ్విస్తుంటాయి. త్రివిక్రమ్ రచన, విజయ్ భాస్కర్ దర్శకత్వం, సోనాలి బింద్రే గ్లామర్ ఈ చిత్రానికి ఆకర్షణగా నిలిచాయి. ఇక స్టైల్ కి ఐకాన్ లాగా ఉండే నాగార్జున ఈ చిత్రంలో మరింత హ్యాండ్సమ్ గా కనిపించారు. ఈ అంశాలన్నింటి వలన మన్మథుడు చిత్రం నాగార్జున కెరీర్ లో మెమొరబుల్ చిత్రంగా మిగిలిపోయింది.
రిపీట్ చేస్తాడా
ప్రస్తుతం యువ దర్శకుడు రాహుల్ రవీంద్రన్ మన్మథుడు మ్యాజిక్ ని రిపీట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. నాగార్జున సరసన ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర షూటింగ్ పోర్చుగల్ లో ప్రారంభమైంది. ఎక్కువ భాగం షూటింగ్ అక్కడే జరుగుతుందట. కొన్ని సాంగ్స్ ని కూడా పోర్చుగల్ లోనే చిత్రీకరించనున్నారు.
మతి పోగొడుతున్న నాగ్
మన్మథుడు 2 షూటింగ్ స్టిల్స్ ని దర్శకుడు రాహుల్ రవీంద్రన్ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు. నాగార్జున లుక్ ఈ స్టిల్స్ లో మతి పోగొట్టే విధంగా ఉంది. ఈ వయసులో కూడా నాగ్ మైంటైన్ చేస్తున్న ఫిట్నెస్ కు అంతా ఫిదా కావాల్సిందే. చెట్టుకు వేలాడుతూ నాగ్ కండలు ప్రదర్శిస్తున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. నాగార్జుననని మన్మథుడు 2 లో తాను ఎలా చూపించబోతున్నానో రాహుల్ రవీంద్రన్ ఈ ఫోటోల ద్వారా తెలియజేశాడు.
ఈ ఒక్క సీన్ మీ కోసమే
'దిస్ మ్యాన్.. ఫిట్ నెస్ గోల్స్.. కింగ్ ఫ్యాన్స్.. ఈ ఒక్క సీన్ మీ కోసమే అంటూ రాహుల్ రవీంద్రన్ ట్వీట్ చేశాడు. నాగార్జునపై షూట్ చేసిన సన్నివేశాలని మోనిటర్ నుంచి కట్ చేసి ఈ ఫోటోలని షేర్ చేశాడు. మొత్తంగా మన్మథుడు 2 చిత్రంలో పాత నాగార్జునని చూడబోతున్నట్లు తెలుస్తోంది సమంత ఈ చిత్రంలో అతిథి పాత్రలో కనిపిస్తుందట. చైతన్య భరద్వాజ్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.