అక్కినేని హీరోల విషయమై అవన్నీ పుకార్లే.. ఖండించిన రాహుల్ రవీంద్రన్

సినీ ఇండస్ట్రీలో గాసిప్స్ పుట్టుకురావడం కామన్. హీరో హీరోయిన్ల ఎఫ్ఫైర్స్ గురించి ఇలాంటి గాసిప్స్ ఎక్కువగా వింటుంటాం. అయితే ఈ మధ్యకాలంలో.. ఎక్కువగా ఫేం ఎవరవుతున్నారో వారినే టార్గెట్ చేస్తూ పుకార్లు పుట్టిస్తున్నారు గాసిప్ రాయుళ్లు. ఈ నేపథ్యంలోనే మన్మథుడు 2 సినిమా క్రేజ్ క్యాచ్ చేసుకుంటూ ఆ సినిమా డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ త్వరలోనే అక్కినేని వారసులు నాగచైతన్య, అఖిల్‌లతో మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నాడని వార్తలు పుట్టించారు.

అయితే తాజాగా ఈ విషయమై స్పందించిన రాహుల్ రవీంద్రన్ అవన్నీ పుకార్లేనని కొట్టిపారేశారు. అస‌లు ఆ వార్త‌ను ఎవ‌రు క్రియేట్ చేశారో త‌న‌కు తెలియ‌ద‌ని, అందులో నిజం లేదని అన్నారు. ప్రస్తుతం తన దృష్టాంతా మ‌న్మ‌థుడు 2 సినిమాపైనే ఉందని, ఆ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఎలాంటి ఆదరణ వస్తుందని ఆసక్తిగా ఉందని చెప్పారు. మ‌న్మ‌థుడు 2 సినిమా విడుదలయ్యాక తన తర్వాతి సినిమా గురించి ఆలోచిస్తానని, ప్రస్తుతం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన అన్నారు.

Rahul Ravindrans Next Movie Update

ఇక రాహుల్ ప్రెసెంట్ సినిమా మన్మథుడు 2 విషయానికొస్తే.. వయాకామ్‌ 18 స్టూడియోస్‌, మనం ఎంటర్‌ప్రైజెస్‌, ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌ పతాకాలపై నాగార్జున హీరోగా ఈ సినిమా రూపొందింది. చిత్రంలో నాగార్జున సరసన ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించగా.. కీర్తి సురేష్, సమంత కీలక పత్రాలు పోషించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్ సినిమాపై ఆసక్తి రేకెత్తించాయి. చిత్రంలో నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ నడుమ రొమాంటిక్ సీన్స్ హైలైట్ కానున్నాయని ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. ఆగస్ట్‌ 9వ తేదీన భారీ అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X