»   » సొంత తల్లితో ఎఫైర్....హీరోపై దారుణమైన ఆరోపణలు

సొంత తల్లితో ఎఫైర్....హీరోపై దారుణమైన ఆరోపణలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఒకప్పటి బాలీవుడ్ హీరో, మహేష్ భట్ ఆషిఖి సినిమా ద్వారా 90ల్లో ఫేమస్ అయిన రాహుల్ రాయ్ ఇటీవల.... ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒకప్పుడు మీడియా వల్ల తాను ఎంత క్షోభపడ్డానో వివరించారు.

మీడియా తనపై రూమర్స్ స్ప్రెడ్ చేయడం వల్ల తన కెరీర్ తో పాటు హెల్త్ కూడా పాడయిందని చెప్పుకొచ్చారు. చివరకు తన తల్లితో కూడా ఎఫైర్ అంటగట్టి నీచమైన స్థితిలో తనను నిలబెట్టారని తెలిపారు.

తన తల్లి అని తెలియక

తన తల్లి అని తెలియక

ఓ సారి స్టార్ హోటల్ లో ఫ్రెండ్స్ తో కలిసి పార్టీకి వెళ్లాను. అక్కడ అప్పటి నా మదర్ వాళ్ల స్నేహితులతో కలిసి ఉన్నారు. నా స్నేహితులు కోరడంతో నా తల్లితో కలిసి డాన్స్ చేసాను. కానీ ఆమె నా తల్లి అని తెలియక కొందరు మీడియా వారు మా ఇద్దరి మధ్య ఎఫైర్ ఉన్నట్లు వార్తలు రాసారు అని రాహుల్ రాయ్ తెలిపారు.

అదో తీవ్రమైన దాడి

అదో తీవ్రమైన దాడి

తనపై రూమర్స్, లింకప్స్ రూపంలో తీవ్రమైన దాడి జరిగింది. నా తల్లితో, నా కో స్టార్స్ తో రంకు అంటగట్టి వార్తలు రాసారు. ఇలాంటి వార్తల వల్ల నా కెరీర్ నాశనం అయింది. మానసికంగా కూడా ఎంతో క్షోభ పడ్డాను అని రాహుల్ రాయ్ తెలిపారు.

వారి బాయ్ ఫ్రెండ్స్, భర్తలు నాపై దాడి చేసారని

వారి బాయ్ ఫ్రెండ్స్, భర్తలు నాపై దాడి చేసారని

ఓసారి నాకు యాక్సిడెంట్ అయింది. ఆసుపత్రిలో చికిత్స అనంతరం ఇంటికి వచ్చిన తర్వాత కొన్ని వార్తలు విన్నాను. నా కోస్టార్లతో ఎఫైర్లు ఉన్నాయని...వారి బాయ్ ఫ్రెండ్స్, భర్తలు నాపై దాడి చేసారని చర్చించుకోవడం విన్నాను. నేను ఆసుపత్రిలో ఉన్నపుడు చనిపోయినట్లు కూడా ప్రచారం జరిగింది అని రాహుల్ రాయ్ తెలిపారు.

రాహుల్ రాయ్

రాహుల్ రాయ్

ఒకప్పుడు బాలీవుడ్లో హీరోగా చేసిన రాహుల్ రాయ్ స్టార్ హీరో స్థాయికి ఎదగలేక పోయాడు. 2000 సంవత్సరం తర్వాత హీరోగా అవకాశాలు తగ్గాయి.

English summary
Remember this 90s B town hero who shot to fame with Mahesh's Bhatt's Aashiqui? Rahul Roy shared to media recently that he suffered a bizarre accusations from media.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu