బ్లాక్‌లో పెట్టింది అన్ ఫాలో చేసింది.. అషూ రెడ్డిపై రాహుల్ కామెంట్స్
బిగ్ బాస్ మూడో సీజన్ కంటెస్టెంట్లైన రాహుల్ సిప్లిగంజ్, అషూ రెడ్డిలు సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతూనే ఉంటారు. బిగ్ బాస్ ఇంట్లో ఉన్న సమయంలో అంతగా క్లోజ్ అవ్వలేదు. కానీ బయటకు వచ్చాక మాత్రం ఫుల్ రచ్చ చేస్తున్నారు. ఒకప్పుడు రాహుల్ పునర్నవి అనే వారు. కానీ ఇప్పుడు మాత్రం రాహుల్ అషూ రెడ్డి జంటే ట్రెండ్ అవుతోంది. అయితే ఈ ఇద్దరూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
Recommended Video

బిగ్ బాస్ ఇంట్లో అలా..
బిగ్ బాస్ ఇంట్లో ఉన్న సమయంలో రాహుల్, అషూలు ఎక్కువగా మాట్లాడుకోలేదు. అప్పుడు పునర్నవి చుట్టే రాహుల్ తిరిగాడు. వరుణ్ సందేశ్, వితిక, పునర్నవి, రాహుల్ అందరూ ఒక జట్టుగా ఉండేవారు. కానీ బయటకు వచ్చాక రాహుల్ అషూ రెడ్డిలు ఒక్కటయ్యారు.

అలా కలిశామంటూ..
బిగ్ బాస్ మూడో సీజన్ కంటెస్టెంట్లలో చిల్ అవ్వడం, పార్టీలు చేసుకోవాలి.. బయటకు వెళ్లాలనే అనే మైండ్ సెట్ ఒకేలా ఉండటంతో తామిద్దరం ఇంత క్లోజ్ అయ్యామని రాహుల్, అషూలు చెప్పుకొచ్చారు. తామిద్దరం ప్రతీరోజూ బయటకు వెళ్తామని చెప్పుకొచ్చారు.

గొడవలు అవుతుంటాయి..
మా మధ్య ఎప్పుడూ గొడవలు అవుతుంటాయి.. రెండు మూడు రోజులు మాట్లాడుకోం.. పైగా అషూ నా నంబర్లు బ్లాక్ చేస్తుంది.. ఇన్ స్టాలో అన్ ఫాలో అవుతుంది.. అలా మళ్లీ తనే రెండు మూడో రోజుల తరువాత ఫోన్ చేసి బయటకు వెళ్దాం అని అడుగుతుందని రాహుల్ చెప్పుకొచ్చాడు.

వారిని అవే అడుగుతాం..
అలీ రెజా కనిపిస్తే ఏ ప్రశ్నలు అడుగుతారని ఇంటర్వూ చేసే వ్యక్తి రాహుల్ అషూలను అడిగింది. ఊరికే షర్ట్ ఎందుకువిప్పుతావ్.. ప్రతీ సినిమాల్లో షర్ట్ విప్పుతాడు.. ఎక్కడ బడితే అక్కడ షర్ట్ విప్పుతాడు.. ఎందుకు అలా చేస్తాడని అడుగుతామని అషూ రెడ్డి, రాహుల్ చెప్పుకొచ్చారు.

ఫ్రెండ్ కంటే ఎక్కువ..
మీ ఇద్దరి మధ్య ఏముంది? అని ప్రశ్నిస్తే ఇద్దరూకూడా వెరైటీ సమాధానాలే చెప్పారు. ఫ్రెండ్ అని రాహుల్ చెప్పాడు. ఫ్రెండ్ కంటే ఎక్కువే అని అషూ చెప్పుకొచ్చింది. గర్ల్ కాబట్టి ఫ్రెండ్ కాబట్టి గర్ల్ ఫ్రెండ్ అని రాహుల్ మళ్లీ చెప్పుకొచ్చాడు. అవును రాహుల్ గర్ల్ ఫ్రెండ్‌నే అంటూ అషూ కూడా సమాధానం ఇచ్చింది.


Click it and Unblock the Notifications











