Don't Miss!
- News పిఠాపురంకు చిరంజీవి, మెగా హీరోలు - ముహూర్తం ఫిక్స్..!!
- Finance Gold Price: షాకిస్తున్న బంగారం ధర.. తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిన గోల్డ్ ప్రైస్..
- Automobiles వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన Hyundai Exter - వీడియో
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మొత్తానికి రూమర్లకు అలా చెక్.. నోయల్‌ను ఎట్టకేలకు పట్టేసుకున్నానంటోన్న రాహుల్
బిగ్ బాస్ షో నాల్గో సీజన్ వల్ల బయట ఉన్న వ్యక్తుల మధ్య కూడా బేదాభిప్రాయాలు వస్తుంటాయి. తమకు నచ్చిన కంటెస్టెంట్లకు మద్దతిస్తున్న క్రమంలో మిగతా కంటెస్టెంట్ల అభిమానులకు, ఫాలోవర్లకు మధ్య గొడవలు వస్తుంటాయి. అలా ఈ నాల్గో సీజన్ వల్ల సెలెబ్రిటీల్లో చాలా మంది మధ్య కోల్డ్ వార్ నడిచినట్టు ఆ మధ్య వార్తలు వచ్చాయి. మరీ ముఖ్యంగా నోయల్, రాహుల్ సిప్లిగంజ్ మధ్య దూరం పెరిగిందనే టాక్ వచ్చింది.
Recommended Video
మంచి బంధం..
రాహుల్ సిప్లిగంజ్, నోయల్ మధ్య మంచి బంధం ఉంది. అన్నా అంటూ నోయల్ వెనకాల తిరుగుతుంటాడు రాహుల్. మూడో సీజన్ సమయంలో రాహుల్‌కు నోయల్ బయటి నుంచి బాగానే సపోర్ట్ చేశాడు. చివరి వరకు రాహుల్ కోసం నోయల్ అండగా నిలబడ్డాడు.
నాల్గో సీజన్లో అలా..
బిగ్ బాస్ నాల్గో సీజన్లో నోయల్ ఎంట్రీ ఇచ్చిన క్షణం నుంచి గాయాలు, అనారోగ్యంతో బయటకు వెళ్లే క్షణం వరకు రాహుల్ మద్దతు ఇస్తూనే వచ్చాడు. నోయల్ బయటకు వచ్చాక.. నోయల్ స్నేహితుడు కాబట్టి అభిజిత్‌కు సపోర్ట్ చేస్తున్నానని చెప్పాడు. కొన్ని రోజుల తరువాత సోహెల్‌కు సపోర్ట్ చేయడం ప్రారంభించాడు.
నోయల్ ఇలా రాహుల్ అలా..
బిగ్ బాస్ షో నాల్గో సీజన్ నడిచినంత కాలం అభిజిత్‌కు నోయల్ సపోర్ట్ చేయగా.. సోహెల్ అరియానాలకు రాహుల్ సిప్లిగంజ్ సపోర్ట్ చేశాడు. ఇదే విషయంలో ఈ ఇద్దరి మధ్య చెడిందనే రూమర్లు పుట్టుకొచ్చాయి. నోయల్‌ను అన్ ఫ్రెండ్ చేశాడని, బర్త్ డేకు విష్ చేయలేదని రకరకాల వార్తలు వచ్చాయి.
ఊకో కాక కోసం..
రాహుల్ సిప్లిగంజ్ ఫిల్మ్ నగర్లో ప్రారంభించిన ఊకో కాక కోసం నోయల్ వచ్చాడు. మొదటి బోణీ కూడా నోయలే చేశాడు. అలా నోయల్ రాహుల్ చాలా రోజుల తరువాత కలిశారు. అలా కలిసి తమ మధ్య ఏమీ లేదని పరోక్షంగా తేల్చి చెప్పారు.
మళ్లీ ఇప్పుడు..
తాజాగా రాహుల్ ఓ ఫోటోను షేర్ చేశాడు. ఇందులో నోయల్‌తో ఫోటో దిగుతూ.. ఎట్టకేలకు పట్టేశా దొరికాడు అంటూ చెప్పుకొచ్చాడు. అలా ఈ ఇద్దరి మధ్య ఉన్న బంధం గురించి, బయట వస్తోన్న రూమర్లకు చెక్ పెట్టేశాల పోస్ట్ చేశాడు.