For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నోయల్ యాంటీ ఫ్యాన్స్ అలా చేస్తున్నారు.. ‘బేబీ’పై రాహుల్ సిప్లిగంజ్ ఆవేదన

    |

    రాహుల్ సిప్లిగంజ్ ప్రైవేట్ ఆల్బమ్‌లతోనే ఫేమస్ అయ్యాడన్న సంగతి తెలిసిందే. మంగమ్మ, గల్లీకా గణేష్ ఇలా ఎన్నో మాస్ పాటలతో తెలంగాణలో తన కంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. టాలీవుడ్‌లో ఇండిపెండెంట్ మ్యూజిక ఆల్బమ్ కల్చర్‌ను ఓ స్థాయికి తీసుకురావాలనే తన ధ్యేయమని రాహుల్ చెబుతుంటాడు.

    అందుకే తన ఆల్బమ్స్‌ను ఎంత కష్టమైనా సరే గొప్పగా వచ్చేందుకు ప్రయత్నిస్తాడు. డబ్బులు సమకూర్చుకునేందు ఇంట్లో అమ్మ చేతికి ఉన్న గాజులు కూడా అమ్మేశానని చెప్పి ఆ మధ్య ఎమోషనల్‌గా టచ్ చేశాడు. తాజాగా రాహుల్ ఓ ఆల్బమ్‌ను కష్టపడి చేసిన సంగతి తెలిసింది.

    భారీ ఎత్తున..

    భారీ ఎత్తున..

    రాహుల్ సిప్లిగంజ్ బేబీ అనే ఓ ఆల్బమ్‌ను ఎంతో భారీ ఎత్తున నిర్మించాడు. ఈ ఆల్బమ్ కోసం అన్నపూర్ఱ స్టూడియోలో భారీ సెట్ వేశాడు. ఓ మూడు రోజులు విరామం లేకుండా షూటింగ్ చేశాడు. అయితే ఈ ఆల్బమ్‌ను విడుదల చేయడంలోనూ ఎన్నో అడ్డంకులు వచ్చాయి. సాంకేతిక లోపాల కారణంగా పలు మార్లు వాయిదా పడింది.

    ఎట్టకేలకు సక్సెస్..

    ఎట్టకేలకు సక్సెస్..

    మొత్తానికి బేబీ పాట బయటకు వచ్చింది. హిట్ అయింది. మిలియన్ వ్యూస్‌ను కొల్లగొట్టి మంచిగా దూసుకుపోతోంది. అయితే ఇప్పుడు ఈ ఆల్బమ్‌కు కొత్త సమస్య వచ్చింది. ఆ పాటలో వల్గారిటీ ఎక్కువగా ఉందని, పాటలో బూతులున్నాయని నెటిజన్లు నెగెటివ్ కామెంట్లతో పాటను కించపరుస్తున్నారని రాహుల్ సిప్లిగంజ్ ఓ వీడియోను షేర్ చేశాడు.

    నోయల్ యాంటి ఫ్యాన్స్..

    నోయల్ యాంటి ఫ్యాన్స్..

    బేబీ పాట లిరిక్స్ నోయల్ రాశాడని చెప్పిన తరువాత యాంటీ ఫ్యాన్స్ అందరూ నెగెటివ్ కామెంట్లు చేస్తున్నారని రాహుల్ వాపోయాడు. ఎందుకలా చేస్తున్నారంటూ ప్రశ్నించాడు. పాటను పాటలా జస్ట్ ఎంటర్టైన్మెంట్‌లా చూడండని కోరాడు. వేరే భాషల్లో ఎన్ని బూతులతో వచ్చినా సరే వాటిని ఆదరిస్తారు. కానీ మనం వాళ్లు చేస్తే మాత్రం అంగీకరించరా? ఎందుకంటూ ఫైర్ అయ్యాడు.

    ఎంతో ఖర్చుపెట్టి..

    ఎంతో ఖర్చుపెట్టి..

    టాలీవుడ్‌లో ఇండిపెండెంట్ మ్యూజిక్‌ను ఓ స్థాయిలో పెట్టాలని ఎంతో శ్రమిస్తున్నా.. ఇప్పటి వరకు రాహుల్ సిప్లిగంజ్ అంటే ఓ బ్రాండ్ ఉంది.. మీ అందరి సహాయం, ప్రేమ, ఆదరణతో ఇక్కడికి వచ్చాను. బేబీ కోసం ఎంత ఖర్చుపెట్టానో మీరు ఊహించగలరా? నాకు యూట్యూబ్ నుంచి ఆ డబ్బులేమీ రావు అంటూ రాహుల్ సిప్లిగంజ్ తన బాధనంతా చెప్పుకున్నాడు.

    English summary
    Rahul Sipligunj ABout Noel Anti Fans Comments On Baby Album.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X