హాట్ గర్ల్స్ తో రాహుల్ సిప్లిగంజ్.. 58లక్షలు వృధా.. ఆ బాధలోనే పునర్నవి షాక్

సింగర్ గా కొన్ని ప్రత్యేకమైన ఆల్బమ్స్ తో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సింగర్ రాహుల్ సిప్లిగంజ్ బిగ్ బాస్ సీజన్ 3 ద్వారా మరింత హైలెట్ అయ్యాడు. టైటిల్ విన్నర్ వా నిలిచి ఆడియెన్స్ కి మరింత దగ్గరైన రాహుల్ సింగర్ గా కూడా మరింత బిజీ అయ్యాడు. గతంతో పోలిస్తే రాహుల్ ఇప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో ఎక్కువగా తన గాత్రాన్ని వినిపించే అవకాశం అందుకుంటున్నాడు. అలాగే ప్రయివేట్ సాంగ్స్ కూడా రెడీ చేస్తున్నాడు. అయితే ఇటీవల రాహుల్ చేసిన ఒక ప్రయోగం బెడిసికొట్టింది. ఒక్కసారిగా 58లక్షలు స్వాహా అయినట్లు చెప్పాడు.

ఆ సాంగ్స్ తోనే క్రేజ్

ఆ సాంగ్స్ తోనే క్రేజ్

సింగర్ గా చాలా కాలంగా ఓ వర్గం ఆడియేన్స్ కి రాహుల్ పరిచయమే. ముఖ్యాంగా అతను సొంతంగా కంపోజ్ చేసుకొని పాడిన మంగమ్మ, పూర్ బాయ్, గల్లికా గణేష్, ఎందుకే, మగజాతి.. వంటి సాంగ్స్ కి మంచి క్రేజ్ దక్కింది. యూ ట్యూబ్ లలో మిలియన్ల వ్యూవ్స్ వచ్చాయి. ఎక్కువగా పూర్ బాయ్ అనే సాంగ్ అప్పట్లో ఒక ట్రెండ్ సెట్ చేసి రాహుల్ కి యూత్ లో మంచి క్రేజ్ ను అందించింది.

బిగ్ బాస్ ద్వారా భారీ ఆదాయం

బిగ్ బాస్ ద్వారా భారీ ఆదాయం

ఇక బిగ్ బాస్ షో ద్వారా రాహుల్ తన స్థాయిని మరింత పెంచుకున్నాడనే చెప్పాలి. నాగార్జున మొదటిసారి హోస్ట్ గా వ్యవహరించిన మూడవ సీజన్ లో రాహుల్ టైటిల్ విన్నర్ గా నిలిచిన విషయం తెలిసిందే. 50లక్షల ప్రైజ్ మనీ కూడా అందుకున్నాడు. ఫైనల్స్ లో పోటీగా శ్రీ ముఖి ఉన్నప్పటికి ఆడియెన్స్ సపోర్ట్ తో రాహుల్ టైటిల్ విన్నర్ గా నిలిచాడు.

రాహుల్ పై SPB ఎమోషనల్

సినిమాల్లో పాడిన చాలా పాటలు రాహుల్ కి ఎంతగానో క్రేజ్ అందించాయి. రంగస్థలం సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాలో రంగ రంగ రంగస్థలనా అనే పాటను పాడిన విధానానికి చాలా మంది అగ్ర గాయకులు మెచ్చుకున్నారు. ముఖ్యంగా బాలసుబ్రహ్మణ్యం అయితే పాడుతాతీయగా షోలో అతనికి పాదాభివందనం అంటూ చాలా పెద్ద ప్రశంసలు అంధించడం ఆశ్చర్యకరం.

ఓ బేబి సాంగ్ వల్ల నిండా మునిగిన రాహుల్

అసలు మ్యాటర్ లోకి వస్తే రాహుల్ చేసిన ఒక ప్రయివేట్ పాట వల్ల దాదాపు 58లక్షల రూపాయలు వరకు నష్టం వాటిల్లిందట. చాలా వరకు సంపాదించిన మొత్తం దానిపైనే పెట్టాడట. ఇటీవల రాహుల్ ఓ బేబి అనే ఒక ప్రయివేట్ సాంగ్ ని విడుదల చేశాడు. అయితే ఆ సాంగ్ కోసం ఖర్చు చాలానే చేశారట. హాట్ మోడల్స్ తో భారీ సెట్టింగ్స్ ఏర్పాటు చేసి చాలా కాస్ట్లీగా ఆ సాంగ్ ను షూట్ చేశారు. కానీ దానికి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు.

ఆ పాట కోసం 58లక్షలు

ఆ పాట కోసం 58లక్షలు


ఆ విషయంపై రాహుల్ ఈ విధంగా వివరణ ఇచ్చాడు. ఈ ఒక్క పాట కోసం 58లక్షల వరకు ఖర్చు చేశాము. మరో 30లక్షలు పెడితే ఒక చిన్న సినిమా కూడా తీయవచ్చు. మొదటి నుంచి కూడా ఈ లెవెల్లో చేస్తే పాట పూర్తవుతుందా లేదా అనే అనుమానంతో బాధ అనిపించింది. ఫస్ట్ 20లక్షల్లో అనుకున్నాము. కానీ ఆ లెక్క 58లక్షల వరకు వెళ్లినట్లు రాహుల్ తెలిపాడు.

ఆ సమయంలో చాలా ఒత్తిడి

ఆ సమయంలో చాలా ఒత్తిడి

నిర్మాతలు 30లక్షల వరకే సాంగ్ కోసం ఖర్చు చేశారు. ఆ తరువాత మిగిలిన ఎమౌంట్ 28లక్షల వరకు నేనే పెట్టుకున్నాను. ఆ సమయంలో చాలా టెన్షన్ పడ్డాను. ఒకరి తరువాత మరొకరు పేమెంట్స్ కోసం అడుగుతుంటే చాలా ఒత్తిడిగా అనిపించింది. ఒత్తిడి తట్టుకోలేక ఎమోషన్ లో సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కూడా చేశానని రాహుల్ అన్నాడు.

Recommended Video

Rahul Sipligunj New Look Shocks His Fans
అప్పుడే పునర్నవి పోస్ట్..

అప్పుడే పునర్నవి పోస్ట్..

అయితే నేను సోషల్ మీడియాలో బాధతో హార్ట్ బ్రేక్ అయినట్లు పోస్ట్ చేసినప్పుడే.. సడన్ గా నా కర్మ కొద్దీ పునర్నవి ఎంగేజ్మెంట్ పోస్ట్ పెట్టింది. నిజంగా ఆ విషయం గురించి నాకు తెలియదు. కానీ బయట జనాలు మాత్రం అది పునర్నవి కోసం బాధతోనే పోస్ట్ చేశానని తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను ఏదో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ వల్ల పెట్టిన పోస్ట్ ఆ విధంగా వైరల్ అవుతుందని అనుకోలేదు.. అంటూ రాహుల్ తెలిపాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X