‘ఊకో కాక’ కోసం ముంబైలో మకాం.. రాహుల్ ప్లానింగ్స్ మామూలుగా లేదు!
రాహుల్ సిప్లిగంజ్ ఈ మధ్య ఎంత బిజీగా ఉన్నాడో అందరికీ తెలిసిందే. సినిమాల్లో యాక్టింగ్, ప్రైవేట్ ఆల్బమ్స్ అంటూ బిజీగా ఉన్న రాహుల్ ఇప్పుడు వ్యాపారంలోకి దిగాడు. మామూలుగా సెలెబ్రిటీలందరూ కూడా ఏదో ఒక వ్యాపారంలో పెట్టుబడే పెట్టే ఉంటారు. కొందరు బహిరంగంగా ప్రకటిస్తారు. ఇంకొందరు తెలియకుండా వ్యాపారాలను చేస్తుంటారు. అయితే రాహుల్ మాత్రం అందరికీ తెలిసేలా తన బ్రాండ్ పాపులర్ అయ్యేలా భారీగా ప్రమోషన్స్ చేస్తున్నాడు.
బ్యూటీ హీనా పంచల్ ఎద అందాల ఆరబోత.. హాట్ హాట్‌గా ఫోటోషూట్

ఊకో కాక అంటూ రచ్చ..
రాహుల్ సిప్లిగంజ్ తన ఊత పదాలను బ్రాండ్ అంబాసిడర్‌గా మార్చేశాడు. మొదటగా చిచ్చా అనే బ్రాండ్‌తో వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకున్నాడు. కానీ అది వర్కవుట్ కాలేదు. చివరకు ఊకో కాక అంటూ తన దైన స్టైల్‌లో ఓ బ్రాండ్‌ను క్రియేట్ చేశాడు. ఇప్పుడు రాహుల్ సిప్లిగంజ్ ఊకో కాక మెన్స్ వేర్ స్టోర్‌లకు విపరీతంగా క్రేజ్ వచ్చింది.

వరుసగా స్టోర్స్..
రాహుల్ సిప్లిగంజ్ మొదటగా తన స్టోర్‌ను కరీంనగర్‌లో ప్రారంభించాడు. అలా మొదటి స్టోర్‌కే ఫుల్ క్రేజ్, ప్రమోషన్స్ వచ్చాయి. స్టోర్ ప్రారంభించిన ఒకటి రెండు రోజుల్లోనే ఫుల్‌గా డిమాండ్ ఏర్పడింది. డిమాండ్‌కు అనుగుణంగానే వరుసగా స్టోర్‌లను ప్రారంభించేశాడు.

త్వరలోనే అలా..
రాహుల్ సిప్లిగంజ్ తన ఊకో కాక స్టోర్‌లను ఫ్రెండ్ సాయంతో దేశ వ్యాప్తంగా పెట్టే ఆలోచనలో ఉన్నాడు. ఏడాది క్రితమే ఊకో కాక పనులు మొదలుపెట్టాడట. అందులో భాగంగా రాహుల్ దేశ వ్యాప్తంగా 60, 70 స్టోర్‌లను పెట్టే ఆలోచనలోనే ఉన్నాడట. ఏడాది ఏడాదిన్నర లోపు నేషనల్ వైడ్‌గా ఊకో కాక బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తానని చెప్పుకొచ్చాడు.

అందుకే ముంబైలో..
అలా తన ఊకో కాక బ్రాండ్‌ను ప్రమోట్ చేసుకునే భాగంలోనే అలీ రెజాను రాహుల్ ముంబైకి తీసుకెళ్లినట్టున్నాడు. ప్రస్తుతం ఈ ఇద్దరూ కూడా అక్కడే ఉన్నారు. ముంబైలో స్పెసల్ డిజైనర్‌లతో తమ ఊకో కాక బ్రాండ్ దుస్తులను డిజైన్ చేస్తున్నట్టున్నాడు.
Recommended Video

విజయమంటే అదే..
విజయం వల్ల సంతోషం రాదు.. సంతోషంగా ఉంటేనే విజయం వరిస్తుంది.. నీ పనిని నువ్ ప్రేమిస్తే.. నువ్ సక్సెస్ అవుతావ్ అంటూ ముంబైలో రాహుల్ రచ్చ చేస్తున్నాడు. ఊకో కాక వ్యాపార పనుల నిమిత్తం ముంబైకి వచ్చానని రాహుల్ చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications











