For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శ్రీముఖి, నేను అందుకే విడిపోయాం.. పునర్నవి, ఆషురెడ్డితో డేటింగ్ విషయంపై రాహుల్ సిప్లిగంజ్

    |

    సింగర్‌గా ప్రయాణాన్ని మొదలుపెట్టిన రాహుల్ సిప్లిగంజ్‌ బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో ద్వారా ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. బిగ్‌బాస్ విజేతగా ఆ తర్వాత యాంకర్, హోస్ట్‌గా పలు రకాల పాత్రలను పోషిస్తున్నారు. ఇటీవల ప్రముఖ తెలుగు టెలివిజన్ ఛానెల్‌తో మాట్లాడుతూ తన వ్యక్తిగత, ప్రొఫెషన్ విషయాలను వెల్లడించారు. పునర్నవి, శ్రీముఖితో ఉన్న సంబంధాలను చెబుతూ..

    చిరంజీవితో అవార్డు అందుకోవడం

    చిరంజీవితో అవార్డు అందుకోవడం

    నాది ఓల్డ్ సిటీ బ్యాక్ గ్రౌండ్. ఫిలింనగర్ చూడటానికి ఎప్పుడూ వస్తుండే వాడిని. అలాంటిది సినిమా ఇండస్ట్రీలో భాగం కావడం, ఈ పరిశ్రమలో నాకు స్థానం లభించడం ఆనందంగా ఉంది. అతి తక్కువ కాలంలో చిరంజీవి చేతుల మీదుగా అవార్డును అందుకోవడం గత జన్మలో చేసిన పుణ్యంగా భావిస్తాను అంటూ రాహుల్ సిప్లిగంజ్ అన్నారు.

     మెగాస్టార్ పుట్టిన రోజునే నా బర్త్ డే

    మెగాస్టార్ పుట్టిన రోజునే నా బర్త్ డే

    మెగాస్టార్ చిరంజీవి అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం. ఆయన సినిమాలను నా తల్లిదండ్రులు చూసే వారు. వారితోపాటు చిరంజీవి సినిమాలంటే నాకు ఇష్టం ఏర్పడింది. అయితే ఆయన పుట్టిన రోజు.. నా పుట్టిన రోజు ఒకే రోజు కావడం నాకు మరింత ఆనందం కలుగుతుంది. ఇదంతా ఊహించుకొంటేనే ఓ కలగా ఉంటుంది అని రాహుల్ చెప్పారు.

    అషురెడ్డి నాకు గర్ల్‌ఫ్రెండ్ కాదు

    అషురెడ్డి నాకు గర్ల్‌ఫ్రెండ్ కాదు

    అషురెడ్డి నాకు బిగ్‌బాస్‌లోనే పరిచయం. ఆమెతో నేను డేటింగ్ చేయడం లేదు. ఆమె నాకు జాన్ జిగర్ దోస్త్. గర్ల్ ఫ్రెండ్ కంటే తక్కువ.. ఫ్రెండ్ కంటే ఎక్కువ. అషురెడ్డితో నా రిలేషన్‌ ప్రత్యేకమైనది. మా మధ్య అలాంటి బంధం లేదు. ఇన్స్‌టాగ్రామ్‌లో పెట్టిన పోస్టు గురించి అంతా తప్పుగా అర్ధం చేసుకొన్నారు అని రాహుల్ సిప్లింగజ్ వివరణ ఇచ్చారు.

    పునర్నవితో డేటింగ్ చేయలేదు

    పునర్నవితో డేటింగ్ చేయలేదు

    ఇక పునర్నవితో కూడా నేను డేటింగ్ చేయలేదు. బిగ్'బాస్‌లోనాకు క్లోజ్ రిలేషన్ ఏర్పడింది. దాంతో అంతా మా మధ్య ఏదో నడుస్తుందని అనుకొన్నారు. ఆమె కూడా నాకు మంచి ఫ్రెండ్. మనిషిగా ప్రేమిస్తాను తప్ప.. అందరూ అనుకొంటున్నట్టు మా మధ్య ఎలాంటి రిలేషన్ లేదు అని అన్నారు.

     శ్రీముఖితో అందుకే విడిపోయాను

    శ్రీముఖితో అందుకే విడిపోయాను

    పున్నవి భూపాలం, అషురెడ్డి కంటే ముందుగానే నాకు శ్రీముఖితో పరిచయం ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల మా మధ్య దూరం పెరిగింది. అందుకు కారణాలు ఏమీ లేవు. ఎవరికి వాళ్లం చాలా బిజీ అయ్యాం. ఎక్కడైనా కలిస్తే సరదాగా మాట్లాడుకొంటాం. ఇటీవల కలిసి షో కూడా చేశాం అని రాహుల్ సిప్లిగంజ్ పేర్కొన్నారు.

    Bigg Boss Telugu 4 : Divi Elimination For Monal, Samantha Emotional | Filmibeat Telugu
     లవ్ మ్యారేజ్ గురించి

    లవ్ మ్యారేజ్ గురించి

    లవ్ మ్యారేజ్ చేసుకొంటానా? అరెంజెడ్‌ మ్యారేజ్ చేసుకొనే విషయంపై నాకు క్లారిటీ లేదు. భవిష్యత్‌లో ఏం జరుగుతుందో చెప్పలేం. లవ్ మ్యారేజ్ అంటే అమ్మాయి గురించి ముందుగానే తెలుసుకొని పెళ్లి చేసుకోవడం, అరెంజ్‌డ్ మ్యారేజ్ అంటే నేరుగా అమ్మాయిని చూసి నచ్చి పెళ్లి చేసుకోవడం. లవ్ మ్యారేజ్ అంటే ట్రైలర్ చూసి సినిమాకు వెళ్లడం, అరెంజ్‌డ్ మ్యారేజ్ అంటే నేరుగా సినిమాకు వెళ్లి చూడటం లాంటిదని రాహుల్ అన్నారు.

    English summary
    Singer and Bigg Boss Telugu 3 winner Rahul Sipligunj opened about Relation with Sreemukhi, Ashu reddy, Punarnavi Bhupalam. He said I am not dating Ashu Reddy and Punarnavi Bhupalam. I was away from Sreemukhi for no reason. సిం
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X