RRR మూవీ మరో ఘనత: ఆస్కార్ వేదికపై వాళ్లిద్దరి లైవ్.. సినీ చరిత్రలోనే తొలిసారి ఇలా!
భారతీయ సినీ చరిత్రలోనే కనీవినీ ఎరుగని విధంగా భారీ హిట్ కొట్టి రికార్డులు సృష్టించడంతో పాటు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిన సినిమానే RRR (రౌద్రం రణం రుధిరం). టాలీవుడ్‌లోని ఇద్దరు స్టార్ హీరోలను కలిపి దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా ఏకంగా ఆస్కార్ బరిలో నిలిచి సత్తా చాటింది. దీంతో వరల్డ్ వైడ్‌గా ఈ మూవీ పేరు మారుమ్రోగిపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ చిత్రం మరో అరుదైన ఘనతను కూడా సొంతం చేసుకుంది. అసలేం జరిగింది? దానికి సంబంధించిన పూర్తి వివరాలను మీరే చూడండి!

RRR మూవీలో ఎవరున్నారు
ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబోలో రాజమౌళి తెరకెక్కించిన మూవీనే RRR (రౌద్రం రణం రుధిరం). దీన్ని డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఎమ్ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందించారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు. పిరియాడిక్ జోనర్‌లో వచ్చిన దీనిలో చరణ్.. అల్లూరి, తారక్.. కొమరం భీంగా కనిపించి మెప్పించారు.

ఎన్నో అవార్డులు సాధించేసి
RRR (రౌద్రం రణం రుధిరం) మూవీ ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్‌ను సొంతం చేసుకోవడంతో పాటు ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులను ఖాతాలో వేసుకుంది. ఆ మధ్య గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్ చాయిస్ అవార్డులను దక్కించుకున్న ఈ చిత్రం.. తాజాగా హాలీవుడ్ క్రిటిక్స్ అసోషియేషన్ పురస్కారాల్లో ఏకంగా నాలుగు విభాగాల్లో అవార్డులను గెలిచి సరికొత్త చరిత్రను సృష్టించింది.

ఆస్కార్ బరిలో నిలిచిన పాట
RRR (రౌద్రం రణం రుధిరం) మూవీలో నాటు నాటు పాట ప్రపంచం మొత్తాన్ని ఊపేసిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పటికే ఈ సాంగ్ ఎన్నో అవార్డులను కూడా గెలుచుకుంది. ఈ క్రమంలోనే ఇటీవలే ఆస్కార్ అవార్డుకు కూడా బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నామినేట్ అయింది. తద్వారా తెలుగు నుంచి నామినేట్ అయిన మొట్టమొదటి సాంగ్‌గా ఇది రికార్డును సాధించింది.

4 పాటలతో పోటీ పడుతోంది
95వ అకాడమీ (ఆస్కార్) అవార్డు కోసం RRR (రౌద్రం రణం రుధిరం) మూవీ పలు విభాగాల్లో నామినేట్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ, ఇందులోని నాటు నాటు పాట మాత్రమే నామినేట్ అయింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఈ పాటతో పాటు మరో నాలుగు సాంగ్స్ పోటీ పడుతున్నాయి. ఇందులో విజేతగా నిలుస్తుందో లేదో మరికొద్ది రోజుల్లోనే తేలిపోనుంది.

ఆరోజే ఆస్కార్ అవార్డ్ వేడుక
95వ అకాడమీ (ఆస్కార్) అవార్డులను 2023 మార్చి 12వ తేదీన ప్రకటించబోతున్నారు. అదే రోజున ఈ అవార్డులను ప్రదానం చేస్తారు. తారల తళుకుబెళుకుల మధ్య సాగే ఈ వేడుకను అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో నిర్వహించబోతున్నారు. దీనికి పలు దేశాల నటీనటులు, టెక్నీషియన్లు హాజరు కాబోతున్నారు.

ఆస్కార్ వేదికపై ఇద్దరి లైవ్
2023 మార్చి 12వ తేదీన లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో జరగబోతున్న 95వ అకాడమీ (ఆస్కార్) అవార్డుల కార్యక్రమంలో.. తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన రాహుల్ సిప్లీగంజ్, కాల భైరవ కలిసి RRR (రౌద్రం రణం రుధిరం) మూవీలోని 'నాటు నాటు' పాటకు లైవ్ పెర్ఫార్మెన్స్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని అకాడమీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.

సినీ చరిత్రలోనే తొలిసారిగా
95వ అకాడమీ (ఆస్కార్) అవార్డుల వేదికపై తెలుగు సింగర్లు లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడం ఇదే తొలిసారి అని తెలిసింది. తద్వారా కాల భైరవ, రాహుల్ సిప్లీగంజ్ అరుదైన ఘనతను సాధించబోతున్నారు. ఇది వాళ్లకే కాకుండా తెలుగు వాళ్లందరికీ గర్వకారణం అంటూ సోషల్ మీడియాలో చాలా మంది పోస్టులు చేస్తున్నారు. దీంతో ఇప్పుడిది హాట్ టాపిక్ అయిపోయింది.


Click it and Unblock the Notifications











