Don't Miss!
- Sports సారీ బ్రదర్.. కావాలని కొట్టలేదు - పంత్ ఎమోషనల్ Video
- Finance Nestle India: అదిరిపోయే లాభాలు ప్రకటించిన నెస్లే ఇండియా..
- News రాయలసీమలో టీడీపీకి బిగ్ షాక్ .. వైసీపీలోకి కీలక నేత
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
హీరోగా రాహుల్ సిప్లిగంజ్.. అదిరిపోయే అప్డేట్తో రచ్చ.. అక్కడే అంతా ఓపెన్!
రాహుల్ సిప్లిగంజ్ ఆ మధ్య జిమ్‌లో తెగ కష్టపడ్డాడు. వర్కవుట్లు చేస్తోన్న ఫోటోలను షేర్ చేస్తూ దుమ్ములేపాడు. అలా రాహుల్ తన బాడీని అంతలా ఎందుకు మార్చుకున్నాడో ఇప్పుడు తెలుస్తోంది. రాహుల్ హీరోగా నటించబోతోన్నాడు. ఈమేరకు ఓ అప్డేట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. అసలే రాహుల్ ఇప్పుడు తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించే పనిలో ఫుల్ బిజీగా ఉన్నాడు.
బెడ్ మీద హాట్ ఫోజుతో బబ్లీ తెలుగు హీరోయిన్ (ఫోటోలు)
నటుడిగా బిజీ..
బిగ్ బాస్ షో తరువాత రాహుల్ సిప్లిగంజ్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. మూడో సీజన్ విన్నర్‌గా రాహుల్‌కు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. బిగ్ బాస్ వల్ల రాహుల్‌కు ఇండస్ట్రీలో అవకాశాలు ఎక్కువగా పెరిగాయి. ఇటు సింగర్, అటు నటుడిగా ఫుల్ అవకాశాలు వచ్చేశాయి. ఇంకా వస్తున్నాయి. రంగమార్తాండ సినిమా రాహుల్ కెరీర్‌ను మలుపుతిప్పబోతోన్నట్టు తెలుస్తోంది.
వ్యాపారంలోనూ..
అయితే రాహుల్ ఈ మధ్య మాత్రం తన దృష్టిని వ్యాపారం మీదే పెట్టేశాడు. ఊకో కాక అనే బ్రాండ్‌ను జనాల్లోకి బాగానే తీసుకెళ్లాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో తన బ్రాండ్ స్టోరూంలనుపెట్టాలని ఫిక్స్ అయ్యాడు. ఈ క్రమంలో హైద్రాబాద్, తెలంగాణ ప్రాంతంలో ఇప్పటికే పలు స్టోర్లను ప్రారంభించేశాడు.
సిద్దిపేట షోరూం..
ఇక తాజాగా రాహుల్ సిద్దిపేటలో ఊకో కాక బ్రాంచ్‌ను ప్రారంభించాలని ఫిక్స్ అయ్యాడు. ఈ మధ్యే సిరిసిల్లలో కొత్త బ్రాంచ్‌ను ఏర్పాటు చేశాడు. ఇక ఇప్పుడు సిద్దిపేటలో కొత్త బ్రాంచ్‌ను ప్రారంభించబోతోన్నాడు.అయితే దీనికి ఓ ప్రత్యేకత ఉన్నట్టు తెలుస్తోంది.
హీరోగా ఎంట్రీ..
రాహుల్ సిప్లిగంజ్ ప్రస్తుతం హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఓ అప్డేట్ వచ్చింది. సిద్దిపేటలో బ్రాంచ్ ఓపెన్ చేసే సందర్భంలో అక్కడే ఫస్ట్ లుక్ టైటిల్ సాంగ్ ఇలా అన్నింటిని రివీల్ చేయబోతోన్నట్టు సమాచారం. మొత్తానికి చిచ్చా ఫ్యాన్స్‌కు ఇది గుడ్ న్యూస్. అసలే ఇప్పుడు బిగ్ బాస్ కంటెస్టెంట్లు హీరోలుగా ఎదిగేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.