For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పోలీసులకు చిక్కిన అషు రెడ్డి, రాహుల్: ఆ ఫొటోలు బయటకు రావడంతో మేటర్ లీక్.. వాళ్ల రియాక్షన్ చూస్తే!

  |

  రాహుల్ సిప్లీగంజ్.. అషు రెడ్డి.. కొంత కాలంగా తెలుగు రాష్ట్రాల్లో వీళ్లిద్దరి గురించి ఎన్నో వార్తలు వైరల్ అవుతున్నాయి. బిగ్ బాస్ షో వల్ల వీళ్లిద్దరి మధ్య స్నేహం చిగురించడం.. ఆ తర్వాత తరచూ కలుసుకోవడం.. పార్టీలు చేసుకోవడం వంటి వాటితో వార్తల్లో నిలుస్తున్నారు. అదే సమయంలో ఆ మధ్య తామిద్దరం రిలేషన్‌లో ఉన్నామని బిగ్ బాస్ విన్నరే స్వయంగా చెప్పడంతో ఈ మేటర్ హైలైట్ అయింది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా అషు రెడ్డి, రాహుల్ సిప్లీగంజ్ పోలీసులకు దొరికిపోయారు. దీంతో ఈ జంట మరోసారి హాట్ టాపిక్ అవుతోంది. అసలేం జరిగింది? వివరాల్లోకి వెళ్తే...

  నడివీధిలో మలైకా అరోరా సందడి.. లెగ్స్ అందాలు మైండ్ బ్లోయింగ్

  అషు రెడ్డి అప్పుడు ప్రేమలో పడింది

  అషు రెడ్డి అప్పుడు ప్రేమలో పడింది

  అషు రెడ్డి వైజాగ్‌లో పుట్టి పెరిగింది. అయితే, గ్రాడ్యుయేషన్ కోసం యూఎస్ వెళ్లింది. అది పూర్తయిన తర్వాత అక్కడే ఉద్యోగం కూడా చేసింది. ఆ సమయంలోనే ఒకరితో ప్రేమలో పడింది. కానీ, కొద్ది రోజుల్లోనే అది బ్రేకప్ అయిపోవడంతో, ఆమె డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. దీంతో మందులు వాడడం వల్ల చాలా బొద్దుగా మారిపోయింది. ఈ విషయాన్ని అషు రెడ్డినే స్వయంగా వెల్లడించింది.

  రాహుల్ అలా ట్రాక్ నడిపించాడుగా

  రాహుల్ అలా ట్రాక్ నడిపించాడుగా

  రాహుల్ సిప్లీగంజ్ విషయానికి వస్తే... బిగ్ బాస్ మూడో సీజన్‌లో కంటెస్టెంట్‌గా వెళ్లిన అతడు.. హౌస్‌లో పునర్నవి భూపాలంతో కలిసి రచ్చ రచ్చ చేశాడు. దీంతో వీళ్లిద్దరి మధ్య ప్రేమాయణం సాగుతుందని అంతా అనుకున్నారు. ఆ తర్వాత హగ్గులు, ముద్దులతో ఈ జంట హల్‌చల్ చేసింది. ఈ క్రమంలోనే వీళ్లిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని జోరుగా ప్రచారం కూడా జరిగింది.

  బయటకొచ్చాక కూడా రచ్చ చేశాడు

  బయటకొచ్చాక కూడా రచ్చ చేశాడు

  బిగ్ బాస్ హౌస్‌లోనే కాదు.. బయటకు వచ్చిన తర్వాత కూడా రాహుల్ సిప్లీగంజ్ - పునర్నవి భూపాలంతో కలిసి రచ్చ చేశాడు. ఈ క్రమంలోనే పలు కార్యక్రమాలు, ఇంటర్వ్యూలలో ఆమెతో కలిసి పాల్గొన్నాడు. దీంతో వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోవడం ఖాయం అని అంతా అనుకున్నారు. ఇలాంటి సమయంలో రాహుల్ వ్యాపారంలో బిజీ అయిపోయాడు. పునర్నవి సొంతం పనులు చేసుకుంటోంది.

   వీళ్లిద్దరి మధ్య రిలేషన్ అంటూ షాక్

  వీళ్లిద్దరి మధ్య రిలేషన్ అంటూ షాక్

  బిగ్ బాస్ తర్వాత పలు కార్యక్రమాలతో బిజీ బిజీగా గడుపుతోంది అషు రెడ్డి. ఈ క్రమంలోనే తరచూ ఫ్రెండ్స్‌తో కలిసి డిన్నర్‌కు సైతం వెళ్తోంది. ఇలానే కొద్ది రోజుల క్రితం బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లీగంజ్‌తో డిన్నర్ డేట్‌కు వెళ్లింది. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో వదిలిన అతడు.. తామిద్దరం రియల్ రిలేషన్‌షిప్‌లో ఉన్నామని ప్రకటించి బాంబ్ పేల్చాడు.

  రాహుల్‌తో ట్రాకుపై అషు రెడ్డి క్లారిటీ

  రాహుల్‌తో ట్రాకుపై అషు రెడ్డి క్లారిటీ

  బిగ్ బాస్ విన్నర్ రాహుల్ చేసిన పోస్టుపై తాజాగా అషు రెడ్డి స్పందించింది. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అతడితో దిగిన ఫొటోను షేర్ చేసి.. ‘సమయం వస్తుంది. నిజాలన్నీ అప్పుడే తెలుస్తాయి' అంటూ క్యాప్షన్ పెట్టింది. దీంతో అసలేం జరిగిందన్న ఆసక్తి అందరిలోనూ కనిపిస్తోంది. దీనికి ‘సమయం ఎప్పుడు వస్తుంది బేబీ' అంటూ రిప్లై ఇచ్చాడు రాహుల్ సిప్లీగంజ్.

  పోలీసులకు చిక్కిన అషు, రాహుల్

  పోలీసులకు చిక్కిన అషు, రాహుల్


  ‘ఊకో కాకా' పేరిట బట్టల వ్యాపారాన్ని ప్రారంభించి ఫుల్ బిజీగా మారిపోయాడు రాహుల్ సిప్లీగంజ్. అదే సమయంలో యాంకర్‌గా, యాక్టర్‌గా వరుస ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతోంది అషు రెడ్డి. వీళ్లిద్దరూ తమ తమ పనులతో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇలాంటి సమయంలో వీళ్లిద్దరూ.. పోలీసులకు చిక్కారు. అయితే, ఇది జంటగా జరిగింది కాదు.. విడివిడిగానే పట్టుబడ్డారు.

  Actress Devayani & Director Balu Interview Part 3 | Y Movie
   ఫొటోలు రావడంతో మేటర్ బయటకు

  ఫొటోలు రావడంతో మేటర్ బయటకు

  అసలేం జరిగిందంటే.. అషు రెడ్డి.. రాహుల్ సిప్లీగంజ్ హైదరాబాద్‌లోని ఓ ప్రాంతంలో ట్రాఫిక్ పోలీసులకు విడివిడిగా పట్టుబడ్డారు. ఈ విషయాన్ని ఓ నెటిజన్ ఫొటోలతో సహా షేర్ చేశాడు. దీన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన రాహుల్.. ‘త్వరగా చలాన్ కట్టేయ్.. లేకుంటే మళ్లీ ఫైన్ పడుతుంది' అని పోస్ట్ పెట్టాడు. దీనిపై స్పందించిన అషు ‘నాది కూడా నువ్వే కట్టు' అంటూ రిప్లై ఇచ్చింది.

  English summary
  Bigg Boss Telugu 3 winner Rahul Sipligunj and Anchor Ashu Reddy Caught by Hyderabad Traffic Police At Same Place in The City.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X