రాహుల్ మీదకు ఎక్కేసిన అషూ రెడ్డి.. ఫ్రెండ్ అంటే అలానే ఉండాలట!!
రాహుల్ సిప్లిగంజ్, అషూ రెడ్డిల మధ్య ఏదో నడుస్తోందంటూ ఎన్నో రకాలుగా వార్తలు వచ్చాయి. బిగ్ బాస్ షోలో ఉన్నప్పుడు, షో నుంచి బయటకు వచ్చాక కూడా రాహుల్ పునర్నవిల ప్రేమ, పెళ్లికి సంబంధించిన వార్తలే వైరల్ అయ్యాయి. అయితే మధ్యలో ఆ ఇద్దరి వ్యహారం గురించి అందరూ మాట్లాడటమే మానేశారు. ఆ సమయంలోనే కొత్త జంట తెరపైకి వచ్చింది. ఆ సమయంలో రాహుల్ అషూ రెడ్డి మధ్య మంచి బంధం మొదలవ్వడంతో అందరూ అటు వైపే దృష్టి పెట్టేశారు.

ఇద్దరి మధ్య..
రాహుల్ అషూ రెడ్డి మధ్య ఉన్న క్లోజ్ నెస్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఎక్కడకు వెళ్లినా ఇద్దరూ కలిసే వెళ్లడం, వీకెండ్ పార్టీలు, డేట్‌లకు తిరుగుతూ రచ్చ చేసేశారు. ఇక ఈ ఇద్దరి జంటను చూసిన అభిమానులు వింత వింత ప్రశ్నలు అడిగేవారు. ప్రేమలో ఉన్నారా? పెళ్లి చేసుకుంటున్నారా? అంటూ ప్రశ్నలు కురిపించేవారు.

క్లారిటీ ఇచ్చినా కూడా..
రాహుల్ అషూలు ఇద్దరూ కూడా తమ మధ్య ఉన్న బంధం గురించి ఎన్నో సార్లు క్లారిటీ ఇచ్చారు. తామిద్దం మంచి స్నేహితులం, తమ మధ్య ఇంకెలాంటి రిలేషన్ షిప్ లేదు.. జిగ్రీ దోస్తులం అంటూ ఎన్నో సార్లు పోస్ట్‌లు చేశారు. అందరికీ క్లారిటీ ఇచ్చారు. కానీ ఇంకా ఇంకా అలాంటి రూమర్లే వినిపిస్తుంటాయి.

తాజాగా అలా..
రాహుల్ సిప్లిగంజ్ ప్రస్తుతం ఊకో కాక అనే బట్టల దుకాణం పెట్టే బిజీలోఉన్నాడు. ఇప్పటికే కరీంనగర్‌లో ఊకో కాక మొదటి స్టోర్‌ను పెట్టేశాడు. అది బాగా క్లిక్ అవ్వడంతో ఇప్పుడు హైద్రాబాద్‌లో రెండో స్టోర్‌ను ఏర్పాటు చేసేందుకు రెడీ అయ్యాడు. నేటి సాయంత్రం జరిగే ఈ ప్రారంభోత్సవంలో అషూ రెడ్డి స్పెషల్ గెస్ట్‌గా రానుంది.

స్పెషల్ ఫోటోలతో రచ్చ..
ఇక అషూ రెడ్డి స్పెషల్ గెస్ట్‌గా రాబోతోందంటూ చెబుతూ సస్పన్స్ క్రియేట్ చేయాలని చూశాడు. మొదటి ఫోటోలో అషూను అంత క్లియర్‌గా చూపించకుండా.. నా వెనకాల ఉన్నది ఎవరో తెలుసా? రేపటి మన గెస్ట్ అంటూ చెప్పుకొచ్చాడు. కానీ అది అషూ రెడ్డి అని అందరికీ తెలిసిపోయింది.

ఫ్రెండ్ అంటే అలానే..
రాహుల్ మీద ఎక్కేసిన అషూ ఫోటోలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. ఇద్దరి మధ్య ఎంతటి సన్నిహిత సంబంధం ఉందో ఆ ఫోటోలను చూస్తేనే అర్థమవుతుంది. నిజమైన ఫ్రెండ్‌కు మన వీక్ నెస్ తెలుస్తుంది.. కానీ మన బలాన్ని మాత్రమే బయటకు చెబుతాడు.. మజాక్ కాదు కాక. ఫ్రెండ్ అంటే ఇలానే ఉండాలే. నాకు చాలా నమ్మకాన్ని ఇస్తుందంటూ అషూ గురించి రాహుల్ చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications











