ఆమెతో డేటింగ్ చేద్దామనుకున్నా కానీ..! ఈ 50 లక్షలతో అదే పని.. బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సెన్సేషన్
తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 ప్రోగ్రామ్ 100 రోజుల పాటు రసవత్తరంగా సాగింది. నవంబర్ 3 వ తేదీతో ఈ షోకి వీడ్కోలు చెప్పారు బుల్లితెర ప్రేక్షకులు. బిగ్ బాస్ విన్నర్ గా రాహుల్ ఎంపిక కావడం, ఊహించని విధంగా శ్రీముఖి రన్నరప్‌తో సరిపెట్టుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ సీజన్ 3 కి సంబంధించిన కొన్ని విశేషాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి. అందులో ఒకటే రాహుల్- పునర్నవి రిలేషన్ ఇష్యూ.

రాహుల్- పునర్నవి ట్రాక్.. క్లోజ్ రిలేషన్‌తో
బిగ్ బాస్ మూడో సీజన్‌లో రాహుల్- పునర్నవి ట్రాక్ ఎక్కువగా హైలైట్ అయిన సంగతి తెలిసిందే. షో ప్రారంభం నుంచే దగ్గరైన ఈ ఇద్దరూ చాలా క్లోజ్ రిలేషన్ మెయిన్‌టైన్ చేయడం చూసాం. అందుకే రాహుల్, పునర్నవిలకు ఫాలోయింగ్ కూడా అంతకంతకూ పెరుగుతూ వచ్చేసింది. ఈ జంట ఆట, పాట, టాస్క్‌లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.

ముదిరిన ప్రేమాయణం.. ఇద్దరి వ్యవహారం
దీంతో ‘బిగ్ బాస్ సీజన్ -3'లో పునర్నవికి, రాహుల్ సిప్లిగంజ్‌కి మధ్య ఏదో జరుగుతుందనే ప్రచారం ఊపందుకుంది. రోజు రోజుకూ వీరిద్దరి మధ్య ప్రేమాయణం ముదురుతోదన్న వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమన్నాయి. ఇక చివరకు బిగ్ బాస్ ట్రోఫీ రాహుల్ దక్కించుకోవడంతో వీళ్ళ వ్యవహారంపై ఎన్నో రకాలుగా వార్తలు షికారు చేస్తున్నాయి.

పునర్నవితో రొమాంటిక్ రిలేషన్.. డేటింగ్ చేద్దామనుకుంటే
దీంతో తాజాగా ఈ అంశంపై బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ స్పందిస్తూ షాకింగ్ సంగతులు చెప్పాడు. తనకు ప్రస్తుతం పునర్నవితో ఎలాంటి రొమాంటిక్ సంబంధం లేదని క్లారిటీ ఇచ్చేశాడు రాహుల్. పునర్నవితో డేటింగ్ చేద్దామని అనుకున్నానని, కానీ ఆమె ఒప్పుకోలేదని అన్నాడు. ఆమె జీవితంలో మరో వ్యక్తి ఉన్నాడని, తామిద్దరం మంచి స్నేహితులం మాత్రమే అని చెప్పేశాడు.

50 లక్షల ప్రైజ్ మనీతో అదే చేస్తా..
బిగ్ బాస్ సీజన్ 3 లో ఎన్నో నేర్చుకున్నానని చెప్పాడు రాహుల్. ఈ షోలో పార్టిసిపేట్ చేయడం కారణంగా తన ప్రవర్తనలో మార్పు రావడంతో పాటు, సహనంగా వ్యవహరించడంపై అవగాహన ఏర్పడిందని అన్నాడు. ఈ బిగ్ బాస్ సీజన్ లో ఓట్లేసి గెలిపించిన అభిమానులకందరికీ ధన్యవాదాలు అని చెబుతూ.. తనకు వచ్చిన 50 లక్షల ప్రైజ్ మనీతో ఓ ఫ్లాట్ తీసుకుంటానని రాహుల్ చెప్పాడు.

పున్నుతో కలిసి ఎంజాయ్..
బిగ్ బాస్ ట్రోఫీ అందుకున్న మరుక్షణమే పునర్నవితో కలిసి ఫుల్లుగా ఎంజాయ్ చేశాడు రాహుల్. ఓ గ్రాండ్ పార్టీ అరేంజ్ చేసి తన ఆనందాన్ని పంచుకున్నాడు. ఈ పార్టీలో వరుణ్ సందేశ్, వితిక షేరు, పునర్నవి, రాహుల్ ఫుల్ హంగామా చేసేశారు.


Click it and Unblock the Notifications











