For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కొత్త అవతారం ఎత్తబోతోన్న బిగ్‌బాస్ విన్నర్.. అందరి ఆశీర్వాదం కావాలి.. రాహుల్ సిప్లిగంజ్ కామెంట్స్

  |

  బిగ్‌బాస్ మూడో సీజన్ ఎంతగా ఫేమస్ అయిందన్నది పక్కన పెడితే.. కంటెస్టెంట్లుగా వచ్చిన వారిలో కొందరికి మహర్ధశ పట్టుకుంది. వరుణ్ సందేశ్-వితికా షెరు జంటకు విపరీతమైన పాపులార్టీ రాగా.. పునర్నవి, రాహుల్, హిమజ లాంటి వారికి భారీగా క్రేజ్ పెరిగింది. మధ్యలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తమన్నా, శిల్పా చక్రవర్తి సంగతి ఎలాగున్నా.. శ్రీముఖి లాంటి వారికి ఈ షో ఏమీ కలిసి రాలేదు. ఇందులో అందరి కంటే ఎక్కువగా లాభపడింది మాత్రం ఓ గ్యాంగ్‌గా ఏర్పడిన ఆ నలుగురే.

  ఆ నలుగురికి ఫుల్ ఫేమ్..

  ఆ నలుగురికి ఫుల్ ఫేమ్..

  హౌస్‌లో మంచి స్నేహితులుగా ఉన్న వరుణ్, రాహుల్, పునర్నవి, వితికాలకు బయట భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. సినిమాల్లో నటించి తెచ్చుకున్న క్రేజ్ కంటే బిగ్‌బాస్ షో వల్ల వచ్చిన ఫేమ్ వందరెట్లు ఎక్కువగా ఉంది. రాహుల్-పునర్నవిల మధ్య కెమెస్ట్రీ కూడా బాగా వర్కౌట్ కావడంతో వీరిద్దరికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది.

  వరుస ఆఫర్లతో బిజీ

  వరుస ఆఫర్లతో బిజీ

  బిగ్‌బాస్ టైటిల్ గెలిచిన రాహుల్ సిప్లిగంజ్‌కు వరుసగా ఆఫర్లు క్యూ కడుతున్నాయి. బయటకు వచ్చిన మరుక్షణం నుంచి సినిమా పాటలు పాడుతూ రికార్డింగ్ థియేటర్ల చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. బిగ్‌బాస్ హౌస్‌లో రాహుల్ ఉండటం చేత మంచి ఆఫర్లను మిస్ చేసుకున్న సంగతి తెలిసిందే. అందుకే మళ్లీ అలాంటివి మిస్ కాకూడదని తన ఫ్రొఫెషన్‌లో బిజీగా గడిపేస్తున్నాడు.

  నటుడి అవతారమెత్తిన రాహుల్..

  ప్రస్తుతం ఫుల్ ఫామ్‌లో ఉన్న రాహుల్ సిప్లీగంజ్‌.. మరో కొత్త అవతారం ఎత్తబోతోన్నాడు. బడా డైరెక్టర్ కృష్ణవంశీ సినిమాలో నటించే అవకాశం రాహుల్‌కు వచ్చింది. ఈ మేరకు రాహుల్ ఓ పోస్ట్ కూడా చేశాడు. ఇప్పటి వరకు సింగర్‌గా తెర వెనుకే ఉండి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న రాహుల్.. నటుడిగా నిరూపించుకునేందుకు సిద్దమవుతున్నాడు.

   ఎంతో గౌరవం..

  ఎంతో గౌరవం..

  రమ్యకృష్ణ, ప్రకాశ్ రాజ్, బ్రహ్మనందంలాంటి గొప్పవారితో నటించడం నాకెంతో గర్వకారణంగా ఉంది.. కృష్ణవంశీ గారికి థ్యాంక్స్. ఈ చిత్రంలో నటించేందుకు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను.. నటుడిగా నా ప్రస్థానం మొదలు పెట్టబోతోన్నాను.. మీ అందరి ఆశీర్వాదం కావాలి అంటూ పోస్ట్ చేశాడు.

  #CineBox : Prabhas To Have Dual Role In His Next Period Drama 'Jaan' ?
  ఓ పాత్రను పోషించనున్న అలీ రెజా

  ఓ పాత్రను పోషించనున్న అలీ రెజా

  ఇక, ఇదే సినిమాలో మరో బిగ్ బాస్ కంటెస్టెంట్ అయిన అలీ రేజా కూడా నటిస్తున్నాడు. ఈ విషయాన్ని అతడే రెండు రోజుల క్రితం సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. అంతేకాదు, షూటింగ్ స్పాట్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలను కూడా షేర్ చేశాడు. మరాఠిలో ఘన విజయం సాధించిన ‘నట సామ్రాట్‌' సినిమాను తెలుగులో ‘రంగమార్తండ' పేరుతో రీమేక్‌ చేస్తోన్న సంగతి తెలిసిందే.

  English summary
  Rahul Sipligunj In Krishna Vamsi Ranga Marthanda Movie. I feel very honoured to be a part of this amazing movie with impeccable cast,A big thanks to krishnavamsiofficial Garu I feel very lucky and super excited for the shoot. My debut as an actor,I need all your blessings chichas!
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X