twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నన్నెవరూ నమ్మడం లేదు.. నా మీద నాకు నమ్మకం ఉంది.. నిజం ఏంటో తెలుసంటూ.రాహుల్ సిప్లిగంజ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్

    |

    సింగర్ రాహుల్ సిప్లిగంజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో సొంతంగా కొన్ని ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ పాడుతూ క్రేజ్ తెచ్చుకున్న రాహుల్ సిప్లిగంజ్ ఆ తర్వాత టాలీవుడ్ లో ప్లే బ్యాక్ సింగర్ గా మారి వరుస అవకాశాలు అందుకుని స్టార్ సింగర్ హోదా దక్కించుకున్నాడు. సింగర్ గా ఎంతో ఫేమస్ అయ్యాడో బిగ్ బాస్ కంటెస్టెంట్ గా కూడా అంతే ఫేమస్ అయ్యి బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ గా కూడా నిలిచాడు.. తాజాగా రాహుల్ సిప్లిగంజ్ పెట్టిన సోషల్ మీడియా పోస్ట్ ఆసక్తికరంగా మారింది. వివరాల్లోకి వెళితే

     పెద్ద సెన్సేషన్ గా

    పెద్ద సెన్సేషన్ గా

    కొద్ది రోజుల క్రితం బంజారాహిల్స్ రాడిసన్ బ్లూ హోటల్ లో ఉన్న ఒక పబ్ లో సమయానికి మించి యువత మద్యం తాగుతున్నారని తెలుసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడి చేసిన వ్యవహారంలో యజమానులతో పాటు సుమారు 150 మంది యువతీ యువకులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వీరిలో సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల పిల్లలు కూడా ఉండటం పెద్ద సెన్సేషన్ గా మారింది.

     ఇంటర్వ్యూలో కూడా

    ఇంటర్వ్యూలో కూడా


    ఇదే కేసులో రాహుల్ సిప్లిగంజ్ కూడా పోలీసులకు పట్టుబడ్డారు. పట్టుబడిన సమయంలో కూడా రాహుల్ సిప్లిగంజ్ తాను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని కావాలంటే తనను పరీక్ష చేసుకోవాల్సిందిగా కూడా పోలీసులను కోరా అని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఇదే విషయాన్ని ఆయన ప్రస్తావించాడు.

     ట్రోలింగ్ ఆగడం లేదు.

    ట్రోలింగ్ ఆగడం లేదు.


    తాను తన స్నేహితుడి పుట్టిన రోజు కోసమే అక్కడికి వెళ్లానని సమయం మించి అక్కడ ఉండడమే తాను చేసిన తప్పు అని చెప్పుకొచ్చాడు. అయితే సమయం మించి ఉండటానికి అనుమతి ఇచ్చిన యాజమాన్యానిది కూడా తప్పే కదా అని చెప్పుకొచ్చాడు. రాహుల్ సిప్లిగంజ్ ఇంత క్లారిటీ గా తనకు డ్రగ్స్ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేదు అని డ్రగ్స్ తీసుకోవడానికి తాను వ్యతిరేకమని చెబుతున్నా ఆయన మీద ట్రోలింగ్ మాత్రం ఆగడం లేదు.

     చిన్న సైజు బోటులో

    చిన్న సైజు బోటులో


    నిజానికి గతంలో కూడా రాహుల్ సిప్లిగంజ్ మరో పబ్ వ్యవహారంలో వార్తల్లోకి ఎక్కడంతో అతనికి పబ్బులకు వెళ్లడం చాలా కామన్ అని డ్రగ్స్ కూడా తీసుకుని ఉంటాడని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆయన తాజాగా ఒక వీడియో విడుదల చేశాడు. అందులో రాహుల్ ఒక చిన్న సైజు బోటులో స్నేహితులతో కలిసి ఎక్కడో సముద్రంలో చక్కర్లు కొడుతున్నారు.

    ఎవరూ సిద్ధంగా లేరు

    ఎవరూ సిద్ధంగా లేరు


    ఆ వీడియోను విడుదల చేసి 'నన్ను నమ్మడానికి, నిజాన్ని అర్థం చేసుకోవడానికి ఎవరూ సిద్ధంగా లేరు. అయినప్పటికీ నా మీద నాకు నమ్మకం ఉంది. నిజం ఏంటో నాకు తెలుసు' అంటూ కామెంట్ చేశాడు. అంతేకాక ఈ ఫేక్ ముచ్చట్ల నుంచి తనను దూరంగా తీసుకువెళ్లిన స్నేహితుడు రాజేష్ దాసరికి థాంక్స్ కూడా చెప్పాడు. అయితే ఈ వీడియో పోస్ట్ చూసిన నెటిజన్లు కొందరు 'నిన్ను నమ్ముతున్నాం రాహుల్‌.. వి ఆర్‌ విత్‌ యూ' అంటూ సపోర్ట్‌గా నిలుస్తున్నా మరికొందరు మాత్రం ఇంకా ట్రోల్ చేస్తూనే ఉండడం గమనార్హం.

    English summary
    Rahul Sipligunj made an interesting post about drugs case
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X