రాహుల్‌పై దాడి కేసులో కొత్త ట్విస్ట్: సంచలన విషయాలు లీక్ చేసిన బిగ్ బాస్ విన్నర్
రాహుల్ సిప్లీగంజ్.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు ఒక సంచలనం. సింగర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన అతడు.. ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్‌ను ప్రేక్షకులకు అందించాడు. అలాగే, ప్రైవేటు ఆల్బమ్స్‌తో రాహుల్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. అతడి ప్రతి పాటకు కొన్ని లక్షల్లో వ్యూస్ వచ్చేవి. ఇక, బిగ్ బాస్ షోలోకి ఎంటర్ అయిన తర్వాత రాహుల్ కెరీర్ మారిపోయింది. దీంతో అతడు వరుస ఆఫర్లతో బిజీ అయిపోయాడు. ఈ నేపథ్యంలో అతడిపై దాడి జరగడం కలకలం రేపింది. తాజాగా రాహుల్ దాడి కేసులో కొత్త ట్విస్ట్ బయటకు వచ్చింది. ఆ వివరాలు మీకోసం.!
Recommended Video

ఆ రెండిట్లో రాహుల్ సిప్లీగంజ్‌కు తిరుగులేదు
రాహుల్ సిప్లీగంజ్.. నాగ చైతన్య నటించిన మొదటి చిత్రం ‘జోష్'లో ‘కాలేజ్ బుల్లోడా' అనే పాటతో తన సినీ కెరీర్‌ను ప్రారంభించాడు. ఆ తర్వాత ‘దమ్ము', ‘ఈగ', ‘రచ్చ', ‘కెమెరామెన్ గంగతో రాంబాబు', ‘కృష్ణవందే జగద్గురం', ‘RX100' సహా ఎన్నో చిత్రాలకు పని చేశాడు. అదే సమయంలో ప్రైవేటు ఆల్బమ్స్ చేస్తూ సత్తా చాటాడు. ఫలితంగా ఈ రెండిట్లో తిరుగులేదని నిరూపించాడు.

రాహుల్ ఇలా అవుతాడని ఊహించలేదు
సింగర్‌గా ఫుల్ బిజీగా ఉన్న సమయంలోనే రాహుల్‌కు బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. పద్నాలుగు మంది కంటెస్టెంట్లలో ఒకడిగా హౌస్‌లోకి అడుగు పెట్టిన అతడు.. సీజన్ ప్రారంభంలో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు. అంతేకాదు, హౌస్‌మేట్స్‌తో తరచూ ఏదో ఒక గొడవలో నిలిచేవాడు. కానీ, ఊహించని విధంగా మూడో సీజన్‌కు విన్నర్‌గా నిలిచాడు.

హీరోయిన్‌తో ప్రేమాయణం.. పెళ్లి కూడా ఫిక్స్
బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న సమయంలో రాహుల్ సిప్లీగంజ్... తెలుగు హీరోయిన్ పునర్నవితో ప్రేమాయణం సాగించాడన్న ప్రచారం సాగింది. దీనికి కారణం వీళ్లిద్దరూ హౌస్‌లో చేసిన రచ్చే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక, హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా వీళ్లిద్దరూ లవ్‌లో ఉన్నారన్న టాక్ వినిపించింది. అంతేకాదు, పెళ్లి కూడా చేసుకుంటారని వార్తలు వచ్చాయి.

సీనియర్ హీరో కూతురితో రాహుల్ రొమాన్స్
బిగ్ బాస్ షో వల్ల ఎంతో పాపులారిటీని సొంతం చేసుకున్నాడు రాహుల్ సిప్లీగంజ్. దీంతో అతడి క్రేజ్‌ను వాడుకునేందుకు చాలా మంది ఫిల్మ్ మేకర్లు పోటీ పడ్డారు. ఇందులో భాగంగానే క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ అతడికి సినిమాలో నటించే అవకాశం ఇచ్చాడు. మరాఠీ సినిమాకు రీమేక్‌గా అతడు తీస్తున్న ‘రంగమార్తాండ'లో రాహుల్.. శివాత్మిక రాజశేఖర్‌తో రొమాన్స్ చేయనున్నాడు.

పబ్‌లో రాహుల్‌పై ఎమ్మెల్యే సోదరుడి దాడి
వరుస పాటలు, సినిమాలు, టీవీ షోలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు రాహుల్ సిప్లీగంజ్. అదే సమయంలో తరచూ పబ్‌లు, పార్టీలు అంటూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని ఓ పబ్‌లో రాహుల్‌పై ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సోదరుడు రితేష్ రెడ్డి, అతడి స్నేహితులు బీరు బాటిళ్లతో దాడి చేశారు. ఈ వీడియో అప్పట్లో సంచలనం అయింది.

రాహుల్ సిప్లీగంజ్‌పై దాడి కేసులో కొత్త ట్విస్ట్
రాహుల్‌పై దాడి జరగడం సినీ, రాజకీయ రంగాల్లో కలకలం రేపింది. ఆ సమయంలో అతడు స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు మంత్రి కే తారక రామారావుకు ఘాటుగా ట్వీట్ చేశాడు. దీంతో రాహుల్ కేసు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయిపోయింది. తాజాగా ఈ కేసు గురించి అతడు కీలక విషయాలు వెల్లడించాడు. దీంతో కేసులో కొత్త ట్విస్ట్ బయటకు వచ్చింది.

సంచలన విషయాలు లీక్ చేసిన బిగ్ బాస్ విన్నర్
తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో దాడి తర్వాత జరిగిన విషయాలను వెల్లడించాడు రాహుల్. ‘కొద్ది రోజుల క్రితం వినయ్ భాస్కర్ అన్న ద్వారా ఎమ్మెల్యేలు రోహిత్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి మా ఇంటికొచ్చారు. ఆ సమయంలో నాకు సారీ చెప్పి కేసు వాపసు తీసుకోమన్నారు. కానీ, నేను మాత్రం రితేష్ వచ్చి అందరి ముందు సారీ చెప్పాలి అని డిమాండ్ చేశా' అని వెల్లడించాడు.

ఇంటర్వెల్ అయింది... క్లైమాక్స్ బ్యాలెన్స్ ఉంది
దీనిపై మరిన్ని విషయాలు చెబుతూ.. ‘రోహిత్ రెడ్డి మా ఇంటికి వచ్చినప్పుడు మా అమ్మ అసలు వాళ్లకు సెన్స్ ఉందా? ఒకడ్ని పట్టుకుని పది మంది అటాక్ చేస్తారా అని ప్రశ్నించింది. దీంతో వాళ్లు గమ్మునుండిపోయారు. ఆ తర్వాత వాళ్లు మళ్లీ ఇంటికొచ్చారు. నేను మాత్రం మీడియా ముందుకు రమ్మన్నా. ఈలోపు కరోనా రావడంతో ఇంటర్వెల్ పడింది' అంటూ వివరించాడు.


Click it and Unblock the Notifications











