రాహుల్ సిప్లిగంజ్‌పై బీరు సీసాలతో దాడి.. కేసులో మలుపులు.. అతని తల్లి రియాక్షన్ చూస్తే!
బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్‌పై గత రాత్రి బీరు సీసాలతో దాడి జరిగిన సంగతి తెలిసిందే. తెల్లారేసరికి ఈ వార్త బయటకు రావడంతో అంతా షాకయ్యారు. ఆ దాడి ఎవరు చేశారు? ఎలా జరిగిందనే దానిపై ఆరా దీస్తున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ సిప్లిగంజ్ తల్లి ఈ ఉదంతంపై స్పందించింది. వివరాల్లోకి పోతే..

ఇంటినుంచి వెళ్లి రాత్రి రాలేదు.. అప్పుడే తెలిసింది
నిన్న సాయంత్రం రాహుల్ ఇంటినుంచి వెళ్లాడని, రాత్రి ఇంటికి రాలేదని.. అయితే రాత్రి కాసేపు వాళ్ళ నాన్నతో ఫోన్ మాట్లాడాడని రాహుల్ తల్లి చెప్పింది. ఉదయం టీవీలో న్యూస్ చూశాకే తమకు దాడి గురించి తెలిసిందని ఆమె చెప్పడం విశేషం.
Recommended Video


ఆసుపత్రిలో ఉన్నాడన్న విషయం కూడా..
ఓ పని మీద బయటకెళ్లిన తన కొడుకుపై ఇలా దాడి జరిగిందని తమకు తెలియలేదని, కనీసం రాహుల్ ఆసుపత్రిలో ఉన్నాడన్న విషయం కూడా తనకు తెలియదని చెప్పింది రాహుల్ తల్లి. ఈ ఉదయం విషయం తెలియగానే తన భర్త హాస్పిటల్ వెళ్లాడని, తానూ కూడా ఇప్పుడు హాస్పిటల్ వెళ్ళబోతున్నట్లు ఆమె తెలిపింది. ఈ దాడిపై ఇప్పటివరకు రాహుల్ తల్లిదండ్రులు ఇంకా పోలీసులకు ఫిర్యాదు చేయలేదని తెలుస్తోంది.

మహిళా స్నేహితురాలితో.. పబ్‌లో యువకులు
గత రాత్రి కొందరు స్నేహితులు, మహిళా స్నేహితురాలితో కలిసి సరదా ఎంజాయ్ చేసేందుకు గాను గచ్చిబౌలి లోని ఓ పబ్‌కి వెళ్ళాడు రాహుల్. ఆ సమయంలో అక్కడున్న కొంతమంది యువకులు రాహుల్ వెంట వున్న యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. రాహుల్ కలగజేసుకోవడంతో మాటామాటా పెరిగి పెద్దదైంది.

రాత్రి 11:45.. బీరు సీసాలతో
ఈ వివాదం మరింత ముదరడంతో ఇరువురు దాడులు చేసుకునే వరకు వెళ్లింది. ఈ గొడవలో సదరు యువకులు బీరు సీసాలతో రాహుల్‌పై దాడికి దిగారు. ఈ క్రమంలో రాహుల్ తలపై బాదారు. దీంతో రాహుల్‌కి తీవ్ర రక్తస్రావమైంది. ఈ ఘటన రాత్రి 11:45 గంటల ప్రాంతంలో జరిగింది. వెంటనే రాహుల్‌ని ఆసుపత్రికి తరలించారు.

ఎమ్మెల్యే బంధువులు.. కేసులో మలుపులు
సీసీ ఫుటేజ్ ఆధారంగా రాహుల్‌పై దాడి తాలూకు వీడియోలను పరిశీలిస్తున్నారు పోలీసులు. అయితే ఈ దాడికి పాల్పడింది ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి బంధువులని తెలుస్తోంది. రాహుల్ గొడవకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











