Don't Miss!
- News జనసేనకు మద్దతుగా మెగాస్టార్...పిఠాపురంలో రెండు రోజులు పర్యటన
- Sports CSK vs LSG: అందుకే రచిన్ రవీంద్రను పక్కనపెట్టాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
జోరు మీదున్న రాహుల్ సిప్లిగంజ్.. హీరోగా గ్రాండ్ ఎంట్రీ.. ముహూర్తం ఫిక్స్!
బిగ్ బాస్ ఫేమ్ రాహుల్ సిప్లిగంజ్ ఇప్పుడు హీరోగా మారుతున్నాడు. బిగ్ బాస్ వల్ల వచ్చిన క్రేజ్ మూలాన సింగర్ కాస్తా నటుడు అయ్యాడు. అలా వ్యాపార రంగంలోకి దిగి సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు మొత్తంగా హీరోగా మారిపోయాడు. ఈమేరకు అదిరిపోయే అప్డేట్లతో తన అభిమానుల ముందుకు రాబోతోన్నాడు. ఈ క్రమంలో తన ఊకో కాక బ్రాంచ్‌ను సిద్దిపేటలో ఘనంగా ప్రారంభించబోన్నాడు. ఈ సందర్భంగా తన కొత్త మూవీ ప్రకటన కూడా చేయబోతోన్నాడు.
బిగ్ బాస్ క్రేజ్
రాహుల్ సిప్లిగంజ్‌కు బిగ్ బాస్ కంటే ముందే మంచి ఫాలోయింగ్ ఉంది. ప్రైవేట్ ఆల్బమ్స్,తెలంగాణ పాటలు, ప్లే బ్యాక్ సింగర్‌గా టాలీవుడ్‌లొ మంచి గుర్తింపు ఉండేది. అయితే బిగ్ బాస్ వల్ల ఆ క్రేజ్ మరింత పెరిగింది. చివరకు రాహుల్ సిప్లిగంజ్ బిగ్ బాస్ మూడో సీజన్ విజేతగా నిలిచేంత అభిమానాన్ని సంపాదించుకున్నాడు.
అన్ని రకాలుగా బిజీ..
బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక రాహుల్ సిప్లిగంజ్ అన్ని రకాలుగా బిజీ అయ్యాడు. సింగర్‌గా పలు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. ఇంకా వస్తూనే ఉన్నాయి. రాహుల్ పాడిన ప్రతీ పాట వైరల్ అవుతూ ఉంటుంది. ఇక నటుడిగానూ తన సత్తాను చాటబోతోన్నాడు. ఇక బిజినెస్ మెన్‌గానూ దూసుకుపోతోన్నాడు.
ఊకో కాక అంటూ రచ్చ..
రాహుల్ సిప్లిగంజ్ తన స్నేహితుడితో కలిసి ఊకో కాక అనే మెన్సే వేర్ బిజినెస్‌ను ప్రారంభించాడు. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఊకో కాకను ప్రమోట్ చేసేందుకు, అన్ని చోట్లా షోరూంలను ప్రారంభించేందుకు రెడీ అయ్యాడు. ఇప్పటికే హైద్రాబాద్, దాని పరిసర ప్రాంతాలు, ఇతర జిల్లాల్లోనూ ఊకో కాకను ప్రారంభించాడు.
Recommended Video
సిద్దిపేట్ షోరూం..
ఇక మార్చి 19న సిద్దిపేటలో ఊకో కాకను రాహుల్ ప్రారంభించబోతోన్నాడు. ఈ ఈవెంట్‌కు మంత్రి హరీశ్ రావును ముఖ్య అతిథిగా పిలిచినట్టు తెలుస్తోంది. అయితే ఈ ఈవెంట్లోనే హీరోగా రాబోతోన్న మూవీ టైటిల్, సినిమాలోని సాంగ్‌ను విడుదల చేయబోతోన్నట్టు తెలిపాడు. మొత్తానికి అటు వ్యాపారాన్ని, ఇటు సినీ కెరీర్‌ను రెండింటిని బ్యాలెన్స్ చేసేస్తున్నాడు.