పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ చూసుకునే.. కాలర్ పట్టుకోవడంతో అలా.. దాడిపై నోరు విప్పిన రాహుల్
రాహుల్ సిప్లిగంజ్‌పై బీరు సీసాలతో దాడి.. ఈ వార్తలు గురువారం ఉదయం నుంచి తెగ హల్చల్ చేస్తున్నాయి. ఇన్నాళ్లు పునర్నవి విషయంలోనూ, సినిమాల పరంగానో వార్తల్లో నిలిచే రాహుల్.. ఇలా దాడి ఘటనలో వార్తల్లో నిలిచేసరికి ఆయన అభిమానులు ఆందోళనకు దిగుతున్నారు. అయితే తనపై జరిగిన దాడిపై రాహుల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు మీడియాతో మాట్లాడుతూ అనేక విషయాలు వెల్లడించాడు.

అమ్మాయిలతో అసభ్యంగా..
తనపై జరిగిన దాడిపై స్పందిస్తూ.. బాత్రూమ్ నుంచి వస్తూ.. తన ఫ్రెండ్స్‌ను కామెంట్ చేశారని, తనను తోసుకుంటూ వెళ్లారని తెలిపాడు. ఎందుకలా చేశారని ప్రశ్నిస్తే.. తనను భైరి కొట్టాడని చెప్పుకొచ్చాడు. అప్పుడు తాను కూడా కొట్టానని దీంతో గొడప పెద్దదైందని, వారు బీర్ సీసాలతో దాడి చేశారని చెప్పుకొచ్చాడు.

కాలర్ పట్టుకోవడంతో..
బయటకు లీకైన వీడియోల్లో రాహుల్ అసభ్య పదజాలాన్ని వాడటంపై మీడియా ప్రశ్నిస్తే.. గల్లా పట్టుకోవడంతో అలా అన్నానని, అప్పుడున్న ఎమోషనల్‌లో అలాంటి మాటలే వస్తాయి కదా అని అన్నాడు. వారు అలా కాలర్ పట్టుకుంటే వదిలేయండి అన్నా అంటూ అనలేం కదా అని చెప్పుకొచ్చాడు.

పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ చూసుకునే..
పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ చూసుకుని రెచ్చి పోయే ఇలాంటి వారిని ఊరికే వదిలిపెట్ట కూడదని అన్నాడు. రుబాబ్ చూపించాలని అనుకున్నారని, రితేష్ రెడ్డి ఇంతకు ముందు కూడా పబ్‌లో ఇలానే చేసేవాడని నాకిప్పుడే తెలిసిందని చెప్పుకొచ్చాడు.
Recommended Video


న్యాయం జరగాల్సిందే..
ఈ కేసుపై రాజకీయంగా ఎంత ప్రభావం చూపెట్టినా కాంప్రమైజ్ కానని, న్యాయం జరగాల్సిందేనని డిమాండ్ చేశాడు. వారిని ఇలానే వదిలిస్తే వేరే అమ్మాయిలను కూడా కామెంట్ చేస్తారు.. ఇలానే దాడి చేస్తారు.. వారిని వదిలే ప్రసక్తే లేదని పేర్కొన్నాడు.


Click it and Unblock the Notifications











