twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎట్టిపరిస్థితుల్లో కాంప్రమైజ్ కాను.. న్యాయం జరగాల్సిందే.. దాడిపై రాహుల్ సిప్లిగంజ్ డిమాండ్

    |

    బిగ్‌బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ ఇన్నాళ్లు వార్తల్లో నిలిచింది ఒకెత్తు.. ఈరోజు ఉదయం నుంచి వార్తల్లో నిలవడం మరో ఎత్తు. రాహుల్‌పై బీర్ సీసాల దాడి చేయడం, ఆ వీడియో, ఆ ఘటనకు సంబంధించిన వార్తలు గురువారం ఉదయం నుంచి తెగ వైరల్ అవుతున్నాయి. ఎక్కడ చూసినా.. ఆ దాడికి సంబంధించిన వార్తలే హల్చల్ చేస్తున్నాయి. ఈ దాడిలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే బంధువులు కూడా ఉండటంలో మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. తాజాగా రాహుల్ సిప్లిగంజ్ ఈ దాడిపై స్పందించాడు.

    వారు పది మంది దాకా ఉన్నారు..

    వారు పది మంది దాకా ఉన్నారు..

    పబ్‌లో జరిగిన దాడి గురించి మాట్లాడుతూ.. ఆ సమయంలో వారు ఎమిమిది, పది మంది ఉన్నారని, తానొక్కడినే ఉన్నానని చెప్పుకొచ్చాడు. అందరూ కలిసి తనమీద దాడి చేశారని పేర్కొన్నాడు. అందులో తనను రితేష్ రెడ్డి అనే వాడు మొదట కొట్టాడని, ఆ పేరు నాకు వినబడిందని చెప్పుకొచ్చాడు.

    Recommended Video

    Rahul Sipligunj Involved In A Brawl | పబ్బులో ఘర్షణ..!! || Filmibeat Telugu
    అలా మొదలైంది..

    అలా మొదలైంది..

    తన స్నేహితురాల్లతో పబ్‌లో ఉన్నానని, ఆ సమయంలో వారు తన ఫ్రెండ్స్‌ను కామెంట్స్ చేశారని, తనను తోసుకుంటూ వెళ్లిపోయారని తెలిపాడు. అలా కామెంట్స్ చేయడం, తనను తోయడంతో ఎందుకలా చేశారని ప్రశ్నించానని తెలిపాడు. వారే మొదటతా తనను కొట్టారని ఆపై తాను కూడా దాడికి దిగానని పేర్కొన్నాడు.

    వారు అటాక్ చేస్తారని..

    వారు అటాక్ చేస్తారని..

    వారు అటాక్ చేస్తారని ఎక్కడికి వెళ్లకుండా ఉంటామా? పోలీసులున్నారు, ప్రభుత్వం ఉంది.. న్యాయ వ్యవస్థ ఉంది.. ఎవరో ఏదో చేస్తారని ఇంట్లోనే కూర్చోలేం కదా అని తెలిపాడు. రేపు గుడికి వెళ్తే ఏమైనా చేస్తారని వెళ్లకుండా ఉండలేం.. ఏం జరగుతుందో చెప్పలేం కదా అని తెలిపాడు.

    కాంప్రమైజ్ కాను.. న్యాయం జరగాల్సిందే..

    కాంప్రమైజ్ కాను.. న్యాయం జరగాల్సిందే..

    ఈ సంఘటనలో రాజకీయ ప్రభావం ఉందని తనకు తెలుసనని, ఇప్పటికే ఈ విషయం డీసీపీ, సీపీ వరకు వెళ్లిందని చెప్పుకొచ్చాడు. అతను కూడా టీఆర్‌ఎస్ పార్టీకీ చెందిన వాడని తెలిసిందని పేర్కొన్నాడు. ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ కానని, న్యాయం జరగాల్సిందేనని డిమాండ్ చేస్తున్నానని అన్నాడు.

    English summary
    Rahul Sipligunj Reacted On Attack. Bigg Boss Season 3 Telugu winner Rahul Sipligunj attacked by some persons last night. In this attack he injured and admitted in hospital. Now Rahul mother reacted on this issue.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X