నమ్మి ఎన్నుకుంటే ఇలా చేస్తారా.. కేటీఆర్‌ను ప్రస్తావిస్తూ.. రాహుల్ సిప్లిగంజ్ సుధీర్ఘమైన పోస్ట్

బిగ్‌బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్‌పై దాడి ఘటన హైద్రాబాద్‌లో కలకలం రేపింది. బుధవారం రాత్రి జరిగిన పబ్‌లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సోదరుడి తమ్ముడు దాడి చేసినట్టు రాహుల్ మీడియా ముఖంగా చెప్పుకొచ్చాడు. ఈ దాడిపై పలు రకాల వార్తలు రావడంతో మరోసారి క్లారిటీ ఇచ్చేందుకు రాహుల్ సోషల్ మీడియాను వేదికగా చేసుకున్నాడు.

Recommended Video

Rahul Sipligunj Special Request To KTR | నమ్మి ఎన్నుకుంటే ఇలా చేస్తారా..!! || Filmibeat Telugu
 లైవ్‌లో రాహుల్..

లైవ్‌లో రాహుల్..

కాసేపటి క్రితమే లైవ్‌లోకి వచ్చిన రాహుల్.. దాడి ఎలా జరిగింది? ఎలా మొదలైంది? ఎవరు ముందు గొడవకు దిగారు? వంటి అంశాలను అందరికీ అర్థమయ్యేలా వీడియోను ప్లే చేసి చూపించాడు. తన తప్పు లేదని, వారే మొదటగా కొట్టారని వివరించాడు. ఇదే వీడియోను పోస్ట్ చేస్తూ కేటీఆర్‌కు తన గోడును చెప్పుకున్నాడు.

వీడియో షేర్ చేస్తూ..

పబ్‌లో జరిగిన గొడవకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేస్తూ.. ఆ గ్యాంగ్ ఎలా రెచ్చగొట్టిందో చూడండి.. ఈ వీడియోను చూసి తప్పెవరిదో నిర్దారించడండి.. నిజం వైపు నిలబడండి.. అంటూ తన అభిమానులను కోరాడు. అంతేకాకుండా రాష్ట్ర మంత్రి కేటీఆర్‌కు కూడా ఈ విషయం చేరేలా ఆయన పేరును కూడా ప్రస్తావించాడు.

నమ్మి మేము ఎన్నుకుంటాం

నమ్మి మేము ఎన్నుకుంటాం

నేను ఎప్పుడూ టీఆర్‌ఎస్ పార్టీ కోసమే నిలబడ్డాను. నేను టీఆర్‌ఎస్ పార్టీకే ఓటు వేశాను. తెలంగాణ గడ్డ మీదే పుట్టాను.. దీని కోసమే బతుకుతున్నాను.. నాయకులను నమ్మి మేము ఎన్నుకుంటాం. కానీ వారు తమ పవర్‌ను ఇలా ఉపయోగించుకోకూడదు. తన అన్న ఎమ్మెల్యే అనే అండతో, ధైర్యంతో ప్రజలతో ఇలా తప్పుగా ప్రవర్తిస్తూ.. కొడుతున్నారు. దీన్ని ఆపాలి సర్.

నాది తప్పని తేలితే

నాది తప్పని తేలితే

నాకు న్యాయం కావాలి సర్. మీరు దయచేసి ఈ కేసును పర్యవేక్షించండి..ఒకవేళ నాది తప్పని తేలితే నన్నే శిక్షించండి.. దయచేసి తగిన చర్యలు తీసుకోండి. ఒకవేళ తప్పు నాది కాకపోతే.. మళ్లీ రేపు ఇంకొకరికి ఇలా జరగదని గ్యారెంటీ ఏంటి.

నిష్ఫక్షపాతమైన న్యాయం

నిష్ఫక్షపాతమైన న్యాయం

మీరు మా నాయకులు.. న్యాయం జరుగుతుందని మీ వైపు ఆశగా చూస్తాం. నాకు నిష్ఫక్షపాతమైన న్యాయం కావాలి సర్. ఇలా అధికారాన్ని వాడుకునే వారికి అడ్డుకట్ట వేసేందుకు ఇదే సరైన సమయం. మీరు న్యాయం చేస్తారని నేను నమ్ముతున్నా సర్' అంటూ సుదీర్ఘ మైన పోస్ట్ చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X