తప్పు చేస్తే పడతాను.. ఘటనపై క్లారిటీ.. వీడియో బయట పెట్టిన రాహుల్
బిగ్‌బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్‌పై పబ్‌లో దాడి ఘటన ఎంతటి సంచలనంగా మారిందో అందరికీ తెలిసిందే. ఎమ్మెల్యే సోదరుడు రితేష్ రెడ్డి తనపై దాడి చేశాడని చెప్పిన రాహుల్ అందుకు సంబంధించిన వీడియోను కూడా బయట పెట్టాడు.బుధవారం అర్దరాత్రి ఈ ఘటన జరగ్గా.. నిన్న పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించాడు.

వారే ముందు దాడి..
పబ్‌లో తన ఫ్రెండ్స్‌తో ఉన్నానని, వారే అమ్మాయిలను కామెంట్ చేసుకుంటూ తనను తోసుకుంటూ వెళ్లారని చెప్పుకొచ్చాడు. అయితే ఎదురు ప్రశ్నించడంతో వారే ముందుగా కొట్టారని, ఆపై తాను కూడా కొట్టానని చెప్పుకొచ్చాడు. ఆ గొడవ పెరిగి పెద్దదైందని తెలిపాడు.

సోషల్ మీడియాలో విమర్శలు..
రాహుల్ సిప్లిగంజ్‌పై దాడి ఘటను వెలుగులోకి రాగానే అతనికి మద్దతుగా వ్యవహారం అంతా నడిచింది. రాహులే అని ఉంటాడు? వారిని రాహులే గెలికి ఉంటాడనే కామెంట్స్ ఎక్కువయ్యాయి. అయితే వీటన్నంటికి సమాధానం చెప్పేందుకు తాజాగా రాహుల్ లైవ్‌లోకి వచ్చాడు.
తప్పు చేస్తే పడతాను..
తప్పు చేసి బద్నామైతే ఏం అనిపించదు కానీ మన తప్పు లేకుండా ఇలా చేస్తే ఊరుకోమని చెప్పుకొచ్చాడు. రాహులే గెలికి ఉంటాడు కొన్ని కామెంట్స్ వింటున్నానని, అలా అనేవారికి సమాధానం చెప్పేందుకే లైవ్‌లోకి వచ్చాని అన్నాడు. గొడవ మొదలు కాకముందు నుంచీ వీడియోను ప్లే చేసి చూపించాడు.
Recommended Video


వీడియో బయట పెట్టిన రాహుల్..
పబ్‌లో గొడవ జరగక ముందు నుంచీ వీడియోను చూపిస్తూ.. అతనే ముందు తన కాలితో తన్నాడని, ఎందుకు అలా చేశావని అడిగితే.. వచ్చి డైరెక్ట్‌గా బైరి కొట్టాడని అసలు జరిగిన విషయాన్ని బయట పెట్టాడు. ఈ వీడియోను కూడా మీడియాకు ఇచ్చానని, అయితే వారెవరూ ప్లే చేయలేదు అందుకే లైవ్‌లో పెట్టానని తెలిపాడు. న్యాయం జరిగే వరకు పోరాడుతానని చెప్పుకొచ్చాడు. మీ అందరి మద్దతు కావాలని అభిమానులను కోరాడు.


Click it and Unblock the Notifications











