మొన్న అక్కడ.. నేడు ఇక్కడ.. ‘ఊకో కాక’ బ్రాండ్‌తో రాహుల్ రచ్చ
రాహుల్ సిప్లిగంజ్ సోషల్ మీడియాలో ఎంత సందడి చేస్తుంటాడో అందరికీ తెలిసిందే. తనకున్న ఇమేజ్‌ను ఎలా వాడుకోవాలో కూడా తెలిసిన వాడు రాహుల్. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక ఆ ఇమేజ్‌ను వాడుతూ సోషల్ మీడియాలో ఇంకా క్రేజ్‌ను పెంచుకున్నాడు. తనకు వచ్చిన క్రేజ్‌తో ప్రైవేట్ ఆల్బమ్‌లు, సినిమాల్లో అవకాశాలు బాగానే పెరిగాయి. ఇక ఇప్పుడు మళ్లీ ఓ కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేశాడు.

అలాంటి కోరికలు..
బిగ్ బాస్ షోలో ఉన్న సమయంలో రాహుల్ తన కోరికల చిట్టాను వెళ్లడించాడు. తనకంటూ ఓ సపరేట్ బ్రాండ్ ఏర్పాడాలని, సెలూన్ షాపులను హై లెవెల్‌లో పెట్టాలని, ఓ మంచి ఇళ్లు కట్టుకోవాలని ఉందంటూ రాహుల్ తన మనసులోకి కోరికలను బయటపెట్టేశాడు. అయితే బయటకు వచ్చాక మాత్రం ఓ బెంజ్ కారు కొనుక్కుని సైలెంట్‌గా ఉన్నాడు.

పెరిగిన అవకాశాలు..
రాహుల్‌కు బిగ్ బాస్ వల్ల మంచే జరిగింది. మూడో సీజన్ విజేతగా రాహుల్ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. అలా రాహుల్‌కు సినిమాల్లోనూ నటుడిగా అవకాశాలు పెరిగాయి. ఫుల్ బిజీగానే ఉంటున్నాడు. ప్లే బ్యాక్ సింగర్‌గానూ, ప్రైవేట్ ఆల్బమ్స్ క్రియేట్ చేయడంలోనూ బిజీగా ఉన్నాడు.

కొత్త వ్యాపారం..
రాహుల్ సిప్లిగంజ్ తన స్నేహితులతో కలిసి కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాడు. ఊకో కాక అంటూ రాహుల్ సిప్లిగంజ్ తన కొత్త బట్టల దుకాణాన్ని కరీంనగర్‌లో ప్రారంభించాడు. సంక్రాంతి సందర్భంగా రాహుల్ సిప్లిగంజ్ ఆ షాపును ఓపెన్ చేశాడు. అయితే తాజాగా మరో కొత్త బ్రాంచ్‌ను రాహుల్ ప్రారంభించనున్నాడు.

హైద్రాబాద్‌లోనూ..
రాహుల్ సిప్లిగంజ్ తన హైద్రాబాద్ ఊకో కాక బ్రాంచ్ గురించి వివరాలు చెప్పాడు. ఆ షాపు ఓపెనింగ్ పనిలోనే నిమగ్నమైనట్టు పేర్కొన్నాడు. ఈ షాపు జనవరి 17న ప్రారంభించబోతోన్నట్టు పేర్కొన్నాడు. ఫిల్మ్ నగర్‌లో తన కొత్త బట్టల దుకాణం ఉంటుందని తెలిపాడు. మొత్తానికి రాహుల్ మాత్రం ఇలా వ్యాపారంలో దూసుకుపోతోన్నాడు.


Click it and Unblock the Notifications











