»   » బాలీవుడ్ ఛాన్స్: బికినీలో రెచ్చిపోనున్న రాయ్ లక్ష్మి

బాలీవుడ్ ఛాన్స్: బికినీలో రెచ్చిపోనున్న రాయ్ లక్ష్మి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అప్పట్లో బాలీవుడ్‌లో వచ్చిన ‘జూలీ' సినిమా గుర్తుందా?...ఈ సినిమా ద్వారా పాపులరైన హాట్ బ్యూటీ నేహా దుపియా. ఈ చిత్రంలో ఆమె నగ్నంగా నటించి అందరినీ ఆశ్చర్య పరిచింది. రొమాంటిక్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు సీక్వెల్ గా ‘జూలీ 2' రాబోతోంది. అయితే ఈ సినిమాలో నేహా దూపియా నటించడం లేదు. దీంతో ఈ అవకాశం సౌతిండియా హాట్ బ్యూటీ లక్ష్మీ రాయ్‌కి దక్కింది. ఈ సినిమా తర్వాత బాలీవుడ్లో తనకు మంచి అవకాశాలు వస్తాయని భావిస్తోంది లక్ష్మీ రాయ్.

ఈ విషయాన్ని లక్ష్మీ రాయ్ తన ట్విట్టర్ ద్వారా ఖరారు చేసింది. బాలీవుడ్లో ఆమెకు ఇదే తొలి చిత్రం. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఉవ్విల్లూరుతున్న లక్ష్మీరాయ్ గతంలో కంటే మరింత హాట్ అండ్ సెక్సీగా ఈ చిత్రంలో కనిపించబోతోంది. ఈ సినిమాలో ఆమె బికినీ అందాలతో యువతను ఉక్కిరి బిక్కిరి చేయనుంది.

Rai Laxmi in Bollywood movie Julie 2

‘జూలీ 2' చిత్రానికి కూడా దీపక్. ఎస్ శివదాసాని దర్శకత్వం వహించబోతున్నారు. ఒక సాధారణ అమ్మాయి స్టార్ గా ఎలా ఎదిగింది అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఈ సినిమా కోసం మరింత అందంగా కనిపించడానికి లక్ష్మీ రాయ్ దాదాపు 15 కిలోల బరువు తగ్గిందట.

ఈ సంవత్సరం లక్ష్మీ రాయ్ కెరీర్ మంచి ఊపు మీద ఉంది. ఈ అమ్మడు ఈ సంవత్సరం తెలుగులో పవన్ కళ్యాణ్ సరసన ‘సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రంలో స్పెషల్ సాంగులో కనిపించబోతోంది. ఈ విషయాన్ని ఆమె అప్పట్లో ట్విట్టర్ ద్వారా ఖరారు చేసారు. ఈ విషయమై ఆమె స్పందిస్తూ...‘సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రంలో నేను ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాను. చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. పవన్ కళ్యాణ్ గారితో కలిసి నేను ఈ సినిమాలో ఫస్ట్ టైం డాన్స్ కూడా చేయడం మీరు చూస్తారు' అని వెల్లడించారు.

English summary
Raai Laxmi has just confirmed that she has signed up to play the lead role in the sequel to super hit Bollywood thriller flick ‘Julie’, the film with which former Miss India, Neha Dupia shot to fame in Bollywood.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu