ఆ నియోజకవర్గంలో ఎన్నికల కోసం రాజమౌళి.. మొదటిసారి కొత్త బాధ్యతలు!
RRR సినిమాతో రాజమౌళి బ్రాండ్ ఇమేజ్ గ్లోబల్ లెవల్ కి వెళ్ళిపోయిన సంగతి తెలిసిందే. అలాగే పాన్ ఇండియా రేంజ్ లో జక్కన్న హవా కొనసాగిస్తున్నాడు. రాజమౌళి సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఇప్పటి వరకు ఫ్లాప్ అంటూ లేకుండా సినిమాలు చేసుకుంటూ వచ్చాడు. ఇక RRR సినిమాతో గ్లోబల్ ఇమేజ్ తెచ్చుకున్న రాజమౌళిని ప్రభుత్వం కూడా సామాజిక కార్యక్రమాల కోసం ఉపయోగించుకోవడానికి రెడీ అవుతుంది.
ఈ నేపధ్యంలో కర్ణాటక ప్రభుత్వం అక్కడ ఎన్నికల ప్రచార కర్తగా రాజమౌళిని రంగంలోకి దించుతుంది. అయితే రాజమౌళి ఏ పార్టీకి ప్రచారకర్తగా పని చేయడం లేదు. రాయచూరు జిల్లాలో ఎన్నికల ఓటింగ్ శాతం పెరగడం కోసం రాజమౌళి ప్రజల్లో అవగాహన పెంచే కార్యక్రమాలో ఎన్నికల సంఘం కోసం పని చేయనున్నారు. రాయచూరు జిల్లా కలెక్టర్ రాజమౌళిని ఆ జిల్లా ఎన్నికల ప్రచారకర్తగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

రాజమౌళి టాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ దర్శకుడుగా ఉన్న కూడా ఆయన పుట్టింది రాయచూరు అనే సంగతి అందరికి తెలిసిందే. వారి పూర్వీకులు ఆంధ్ర రాష్ట్రం వారే అయినప్పటికీ వ్యాపారం కోసం పలు ప్రాంతాలు వెళ్లేవారు. ఆ విధంగా రాజమౌళి కర్ణాటకలో జన్మించారు. అనంతరం మద్రాసు వెళ్లి అక్కడ కొన్నాళ్లు ఉన్నారు. ఇక ఈ నేపధ్యంలో ఆయన పుట్టిన జిల్లాకి ఎన్నికల ప్రచారకర్తగా రాజమౌళిని నియమిస్తే బాగుంటుంది ఎన్నికల సంఘం భావించింది. కలెక్టర్ చంద్రశేఖర్ మొదట ఈ నిర్ణయం తీసుకున్నారు.
తమ అభ్యర్ధనని రాజమౌళికి వినిపించగా అతను కూడా అంగీకరించడంతో ఆ జిల్లా ఎన్నికల ప్రచారకర్తగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. త్వరలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో ఓటింగ్ శాతం పెంచే ఉద్దేశ్యంలో భాగంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. ఆర్ఆర్ఆర్ ఆస్కార్ ఈవెంట్ ముగించుకొని ఇండియా వచ్చిన తర్వాత రాజమౌళి సొంత జిల్లా రాయచూరుకి వెళ్ళే అవకాశం ఉందని తెలుస్తుంది. అలాగే అక్కడ జిల్లా అధికారులతో కలిసి ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











