బ్రేకింగ్: హీరో నాగశౌర్య ఫామ్‌హౌస్‌పై పోలీసుల మెరుపుదాడి.. రైడ్స్‌లో విస్తుపోయే విషయాలు!
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్యకు చెందిన ఫామ్‌హౌజ్‌పై తెలంగాణకు చెందిన ది స్పెషల్ ఆపరేషన్స్ కమాండ్ పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో విస్తుపోయేలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. నాగశౌర్య ఫామ్‌హౌజ్‌లో సునీల్ చౌదరీ అనే నిర్వాహకుడు పేకాట, కాసినో తరహా జూదాన్ని నిర్వహిస్తున్నట్టు ప్రాథమిక సమాచారం. పోలీసుల మెరుపుదాడుల వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్ శివారులోని మంచిరేవుల
హైదరాబాద్ శివారులోని మంచి రేవులలో ఉన్న ఫామ్‌హౌస్ నాగశౌర్యది అనే మీడియా కథనాలు వెలువడుతున్నాయి. గత రాత్రి స్పెషల్ పోలీసులు పక్కా ప్లానింగ్‌తో మెరుపు దాడులు నిర్వహించారు. దాదాపు 30 మంది జూదరులను పోలీసులు అదుపులోకి తీసుకొన్నట్టు తెలిసింది. తెలంగాణ ప్రభుత్వం నిషేధం విధించిన పేకాటను ఆడుతూ పట్టుబడటం వివాదంగా మారింది.

అక్రమ దందాతో జూదం
మంచిరేవులలోని ఫామ్‌హౌస్‌లో గొద్ది రోజులుగా అక్రమ వ్యవహారాలు చోటుచేసుకొంటున్నాయనే సమాచారంపై పోలీసులు నిశితంగా పరిశీలించారు. అయితే ఆదివారం నాడు భారీగా జనం పేకాట, ఇతర గ్ల్యాంబింగ్ ఆటలు జరుగుతున్నాయనే సమాచారంతో దాడి చేశారు. ఈ దాడుల్లో 67లక్షల రూపాయల నగదు. 33 సెల్‌ఫోన్లు, మూడు కార్లు, 2 కాసినో బాక్సులను సీజ్ చేశారు.

పోలీసుల అదుపులో నిర్వాహకుడు సునీల్ చౌదరీ
నాగశౌర్య ఫామ్‌హౌస్‌లో జరుగుతున్న అక్రమ దందాను సునీల్ చౌదరీ నిర్వహిస్తున్నాడు. పోలీసుల దాడుల తర్వాత సునీల్ చౌదరీ మాట్లాడుతూ.. తాము ఆడుతున్నది పేకాట కాదు.. కిట్టి పార్టీ అని సమాధానం ఇచ్చారు. వీకెండ్‌లో సరదాగా మేము పార్టీని ఏర్పాటు చేసుకొన్నాం. ఇక్కడ రాజకీయ నేతలు, ఇతర ప్రముఖులు రావడం లేదు అంటూ సునీత్ చౌదరీ తెలిపారు.

గోవాలో మాకు క్యాసినో అంటూ
సునీల్ చౌదరీ మాట్లాడుతూ.. గోవాలో మాకు క్యాసినో నిర్వహిస్తుంటాం. దీపావళీ సందర్భంగా ఫ్రెండ్స్ అందరం మూడు ముక్కలు ఆడుతున్నాం. ఇక్కడ క్యాసినో నిర్వహించడం లేదు. ఇది కేవలం స్నేహితుల మధ్య నడిచిన కిట్టీ పార్టీ అంటూ సునీల్ చౌదరీ వెల్లడించారు.
Recommended Video

భారీగా నగదు సీజ్, కేసు నమోదు
మంచి రేవులోని నాగశౌర్యకు సంబంధించిన ఫామ్‌హౌస్‌లో కొద్దికాలంగా భారీగా పేకాట, నిషేధిత జూదం నిర్వహిస్తున్నారు. సినిమా, రాజకీయ వర్గాలు ఇక్కడ భారీగా జూదం ఆడుతున్నారు అని పోలీసులు పేర్కొన్నారు. అయితే వారి వద్ద నుంచి భారీగా నగదు, మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను స్వాధీనం చేసుకొన్నారు. పలువురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











