పడక గదిలోకి వెళితే వర్కవుట్ కాదు.. క్యాస్టింగ్ కౌచ్‌పై ప్రముఖ హీరోయిన్

By Rajababu

హాలీవుడ్ దర్శకుడు హార్వే వెయిన్‌స్టెయిన్ సెక్స్ కుంభకోణాలపై ప్రపంచ సినీ రంగంలో చర్చ జరుగుతున్నది. సోషల్ మీడియాలో 'మీటూ' అంటూ పలువురు సెలబ్రిటీలు గోడును వెళ్లబోసుకొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో బాలీవుడ్ నటి రైమాసేన్ క్యాస్టింగ్ కౌచ్‌పై స్పందించారు. అలాంటి వేధింపులకు గురికాకపోవడం నిజంగా నేను అదృష్టవంతురాలినే అని ఆమె అన్నారు.

 అలనాటి తారలకు వారసురాలిగా

అలనాటి తారలకు వారసురాలిగా

రైమాసేన్ ప్రముఖ నటీమణులు కుటుంబం నుంచి చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించింది. ప్రముఖ తారలు సుచిత్రసేన్ మనవరాలిగా, మున్ మూన్ సేన్ కూతురిగా అందరికి పరిచయమైంది.

లైంగిక వేధింపులపై రైమా

లైంగిక వేధింపులపై రైమా

బాలీవుడ్‌లో పరిణిత, హానీమూన్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్, బాలీవుడ్ డైరీస్ లాంటి చిత్రాల్లో నటించారు. ఆమె నటనకు మంచి ప్రశంసలు లభించాయి. అయితే తన కెరీర్‌లో ఎవరి నుంచి లైంగిక వేధింపులకు గురికాలేదు అని రైమాసేన్ చెప్పింది.

 సక్సెస్‌కు షార్ట్‌కట్ లేదు

సక్సెస్‌కు షార్ట్‌కట్ లేదు

పడక గదిలో వెళ్లితేనే అవకాశాలు వస్తాయనే అంశంపై రైమాసేన్ స్పందించింది. ప్రతీ ఒక్కరి ప్రవర్తనపై ఈ అంశం ఆధారపడి ఉంటుంది. సక్సెస్ సాధించాలంటే దానికి షార్ట్‌కట్ ఉండదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.

పడుకొంటేనే అవకాశాలంటే..

పడుకొంటేనే అవకాశాలంటే..

సినిమా అవకాశం దక్కించుకోవాలంటే డైరెక్టర్‌తో పడుకోవాల్సిన అవసరం లేదు. అదీ ఎప్పటికీ వర్కవుట్ కాదు. సినీ పరిశ్రమలో సక్సెస్ కావాలంటే టాలెంట్ ప్రాధానం అని రైమాసేన్ అన్నారు.

టాలెంటే ఆధారం

టాలెంటే ఆధారం

ఎవరికైనా టాలెంట్ ఉందని భావిస్తే దానినే ఆధారం చేసుకోవాలి. టాలెంట్ లేనప్పుడే ఇలా దిగజారాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఎవరైనా తన మీద తనపై విశ్వాసం పెంచుకోవాలి అని రైమా చెప్పారు

 అందుకే ఎదురు కాలేదనుకొంటా

అందుకే ఎదురు కాలేదనుకొంటా

సుచిత్రసేన్, మూన్ మూన్ సేన్ వారసత్వం ఉండటం వలన నాకు ఇలాంటి పరిస్థితులు ఎదురు కాలేదనుకొంటాను. ఈ అంశాలే ఇలాంటి వేధింపుల బారి పడకుండా చేసి ఉంటాయని అనే బలంగా నమ్ముతాను అని రైమా వెల్లడించారు.

 నటిగా అవగాహన ఉండాలి

నటిగా అవగాహన ఉండాలి

నటిగా ఎదుగాలనే సినీ పరిశ్రమకు వచ్చే వారికి అవకాశాలు ఎలా చేజిక్కించుకోవాలో తెలియదు. వారు పరిస్థితులపై అవగాహన పెంచుకోవాలి. లైంగిక వేధింపుల బారిన పడకుండా కాపాడుకోవాలి అని రైమా సూచించారు.

 సినీ పరిశ్రమకే పరిమితం కాదు

సినీ పరిశ్రమకే పరిమితం కాదు

లైంగిక వేధింపులనే విషయం అన్ని రంగాల్లో ఉంది. కేవలం సినీ పరిశ్రమకే పరిమతం కాదు. అలాంటి వేధింపులకు నేను గురికాకపోవడం నిజంగా అద‌ృష్టవంతురాలినే అని రైమా అభిప్రాయపడింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X