ప్రభాస్‌తో కూడా తమన్నా వానలో భంచికుభం?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా తమన్నాతో వాన పాటలో భంచికుభం ఆడనున్నాడా..? మిల్కీ బ్యూటీ తమన్నా తడిసిన అందాలు మరోసారి ప్రేక్షకులకు కనువిందు చేయనున్నాయా? అంటే అవును అనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభాస్-తమన్నా జంటగా రాఘవ లారెన్స్ దర్శకత్వంలో రూపొందుతున్న 'రెబెల్' చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈచిత్రంలో ఈ ఇద్దరి మధ్య వానపాటను ప్లాన్ చేస్తున్నాడట దర్శకుడు లారెన్స్. 'రచ్చ' చిత్రంలో చరణ్-తమన్నా వాన వాన వెల్లువాయే పాటకు మంచి రెస్సాన్స్ వస్తున్న నేపథ్యంలో లారెన్స్‌కు ఈ ఆలోచన తట్టిందట. తమన్నా గతంలో ఆవారా, బద్రీనాథ్ చిత్రాల్లో వాన పాటల్లో నర్తించి.....అందాలను ఏమాత్రం సిగ్గు పడకుండా ఆరబోసింది. ప్రభాస్ కూడా వర్షం చిత్రంలో త్రిష అందాల మధ్య తడిసి ముద్దయ్యాడు.
ప్రభాస్, తమన్నా, దీక్షాసేథ్, ప్రధాన పాత్రధారులుగా శ్రీ బాలాజీ సినీ మీడియా పతాకంపై 'రెబెల్' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రాఘవ లారెన్స్ దర్శకత్వంలో జె.భగవాన్, జె.పుల్లారావ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దర్శకత్వ బాధ్యతలతో పాటు ఈ చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు లారెన్స్. ఈ చిత్రానికి కెమెరా: సి.రాంప్రసాద్, మాటలు: డార్లింగ్ స్వామి, ఎడిటింగ్:మార్తాండ్ కె.వెంకటేష్, ఆర్ట్:ఎ.ఎస్.ప్రకాష్, నిర్మాతలు: జె. భగవాన్, జె.పుల్లారావు, కథ, స్క్రీన్‌ప్లే, డాన్స్, దర్శకత్వం: రాఘవ లారెన్స్.


Click it and Unblock the Notifications











