రష్మికను బాగా టార్చర్ చేశా.. క్షమాపణ చెప్పినా ఆమె వెక్కి వెక్కి ఏడ్చింది: ప్రముఖ నటుడు
Recommended Video
టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నా కలిసి నటించిన చిత్రం 'డియర్ కామ్రేడ్'. ఎన్నో అంచనాల నడుమ గత వారం విడుదలైన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయినప్పటికీ, మంచి కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఈ సినిమాలో విజయ్‌తో పాటు రష్మిక నటనకు మంచి మార్కులే పడ్డాయి. వాస్తవంగా చెప్పాలంటే లిల్లీ పాత్రే సినిమాను నిలబెట్టింది. దీంతో ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో ఆమెను టార్చర్ చేశానని ఇందులో విలన్‌గా చేసిన నటుడు చెప్పడం ఆసక్తికరంగా మారింది.

బాలీవుడ్ విలన్
‘డియర్ కామ్రేడ్'లో ప్రతినాయకుడి పాత్రలో రాజ్ అర్జున్ అనే బాలీవుడ్ నటుడు నటించారు. ఇందులో చక్కని నటనను కనబరిచారు కూడా. హీరో హీరోయిన్ల తర్వాత అంతగా ఆకట్టుకున్న క్యారెక్టర్ కావడంతో ఆయన నటన పట్ల తెలుగు ప్రేక్షకులు ఆకర్షితులయ్యారు. ఈ సినిమాతో తనకు మంచి గుర్తింపు రావటం పట్ల రాజ్ అర్జున్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

డియర్ కామ్రేడ్ అవకాశం
ఈ సినిమాలో ఆయనకు అవకాశం ఎలా వచ్చిందో వెల్లడించారు. ‘నేను ఆమిర్ ఖాన్ సీక్రెట్ సూపర్ స్టార్ అనే సినిమాలో విలన్‌గా చేశాను. దర్శకుడు భరత్ కమ్మ ఆ సినిమా చూశారు. అందులో నా పెర్ఫార్మెన్స్ నచ్చి నాకు ఫోన్ చేసి పిలిపించారు. అలా ఆ సినిమా ద్వారా నాకు డియర్ కామ్రేడ్ అవకాశం వచ్చింది' అని ఆయన తెలిపారు.

రష్మికను టార్చర్ చేశాను
ఈ సినిమాలో తన పాత్రలో భాగంగా రష్మికను ఇబ్బంది పెట్టానని రాజ్ చెప్పారు. ‘సినిమాలో కొన్ని కొన్ని సీన్స్‌లో హీరోయిన్ రష్మికను నేను చాలా ఇబ్బంది పెట్టా. అలాగే బాగా టార్చర్ కూడా చేశాను. నటనలో భాగంగానే మెంటల్‌గా, ఫిజికల్‌గా తనను చాలా ఇబ్బంది పెట్టాను. తను సీన్ అయిపోయాక కూడా అరగంట వరకు ఏడ్చేది' అని ఆయన చెప్పుకొచ్చారు.

క్షమాపణ కూడా చెప్పా
ఈ సినిమాలో నటనలో భాగంగా తనను ఇబ్బంది పెట్టినప్పటికీ ఆమెకు క్షమాపణ చెప్పానని ఈ బాలీవుడ్ విలన్ వెల్లడించారు. ‘సీన్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ తన దగ్గరకు వెళ్ళి చాలా సేపు మాట్లాడేవాడ్ని. అవి కేవలం సీన్స్ మాత్రమే నువ్వు బాధపడివుంటే నన్ను క్షమించు. బాధపడొద్దు అని చెప్పేవాడ్ని' అని రాజ్ అర్జున్ వివరించారు.

ఫ్రెండ్స్ అయిపోయాం
ఈ సినిమాలో ఆమెను ఎంతగా ఇబ్బంది పెట్టినా.. తర్వాత ఇద్దరం ఫ్రెండ్స్ అయిపోయామని ఆయన అన్నారు. ‘సినీ ఇండస్ట్రీలో ఎక్కడా కూడా ఒక విలన్, హీరో, హీరోయిన్ ఫ్రెండ్స్ అవ్వరు. కానీ, ఈ సినిమాతో మేం ముగ్గురం మంచి ఫ్రెండ్స్ అయ్యాం. రష్మిక మాత్రమే కాదు.. విజయ్ కూడా నాకు బాగా క్లోజ్ అయ్యాడు' అని ఈ బాలీవుడ్ స్టార్ వెల్లడించారు.


Click it and Unblock the Notifications











