twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిరంజీవి సహించలేకపోయాడు, 10 లక్షలు రావాలి.... ప్రముఖ నటుడి ఆరోపణ!

    గోవిందుడు అందరి వాడేలే సినిమా నుండి తనను తొలగించడంపై తాజాగా రాజ్ కిరణ్ స్పందిస్తూ చిరంజీవి పై సంచలన ఆరోపణలు చేసారు.

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: రామ్ చరణ్ హీరోగా కృష్ణ వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన 'గోవిందుడు అందరివాడేలే' మూవీ షూటింగ్ సమయంలో జరిగిన తతంగం అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ పాత్రను తొలుత తమిళ నటుడు రాజ్ కిరణ్ తో చేయించారు. 60 శాతం షూటింగ్ పూర్తయిన తర్వాత రాజ్ కిరణ్ ను తప్పించి ఆ స్థానంలో ప్రకాష్ రాజ్ ను పెట్టి మళ్లీ సినిమా రీ షూట్ చేసారు.

    బోలెడు డబ్బు ఖర్చు పెట్టి సినిమాను మళ్లీ రీ షూట్ చేయడం... నిర్మాతకు అప్పట్లో పెను భారంగానే మారింది. ఏ ఉద్దేశ్యంతో 60 శాతం పూర్తయిన తర్వాత సినిమాను రీ షూట్ చేసారో తెలియదు కానీ.... బాక్సాఫీసు వద్ద సినిమా భారీ పరాజయం పాలైంది.

    అప్పట్లో తనను సినిమా నుండి తొలగించడంపై తాజాగా రాజ్ కిరణ్ స్పందిస్తూ చిరంజీవి పై సంచలన ఆరోపణలు చేసారు.

    చిరంజీవి సహించలేక పోయాడు

    చిరంజీవి సహించలేక పోయాడు

    60శాతం సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత రషెస్ చూసి చిరంజీవి సహించలేక పోయాడు. అందులో రామ్ చరణ్ కంటే నా పాత్రకే ఎక్కువ ప్రాధాన్యం ఉందని చిరంజీవి భావించాడు. ‘ఈ సినిమాలో హీరో రాజ్‌కిరణా? రామ్‌చరణా? అంటూ అసహనానికి గురైనట్లు నాకు తెలిసింది అని రాజ్ కిరణ్ తెలిపారు.

    అన్యాయం చేయడమే

    అన్యాయం చేయడమే

    కేవలం తన పాత్రకు ప్రాధాన్యం ఎక్కువ అయిందని చిరంజీవి.... ఇలా చేయడం మరొక నటుడికి అన్యాయం చేయడం లాంటిదే అని రాజ్ కరణ్ అన్నారు.

    ఇంకా 10 లక్షలు రావాలి

    ఇంకా 10 లక్షలు రావాలి

    నన్ను తప్పించి ప్రకాష్ రాజ్ ను తీసుకునే సమయంలో.... ప్రకాష్ రాజ్ ఈ విషయమై దర్శక నిర్మాతలను అడిగారట. నాకు మొత్తం సెటిల్ చేసామని చెప్పారు. కానీ అది అబద్దం. నాకు రావాల్సిన దాంట్లో ఇంకా రూ. 10 లక్షలు రావాలి అని రాజ్ కిరణ్ తెలిపారు.

    చాలా అగౌరవంగా వ్యవహరించారు

    చాలా అగౌరవంగా వ్యవహరించారు

    ఒక నటుడికి కనీసం సమాచారం ఇవ్వకుండా తీసేయడం అగౌరవ పరచడమే. నిర్మాతగానీ, దర్శకుడు కానీ నాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఓ నటుడి పట్ల ఇలాగేనా వ్యవహరించేది? అంటూ రాజ్ కిరణ్ అసహనం వ్యక్తం చేసారు.

    English summary
    Senior Tamil actor Raj Kiran made a sensational comments against Megastar Chiranjeevi. It is known that earlier Raj Kiran was finalized to play the character of grandfather of Charan in the movie 'Govindudu Andarivadele' but after canning few crucial scenes, he was replaced by another versatile actor Prakash Raj. Now Raj Kiran made comments that he was disrespected by Chiranjeevi as they replaced him without giving any reason.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X