ఈసడించుకునేవారు.. ఈర్ష్యపడే వారు.. ప్రతాప్ పోతన్ గురించి తెలుగు డైరెక్టర్ కామెంట్స్ వైరల్!

హీరోయిన్ రాధిక మాజీ భర్త ప్రముఖ నటుడు ప్రతాప్ పోతన్ గుండెపోటు కారణంగా మరణించిన సంగతి తెలిసిందే. స్వతహాగా మలయాళీ అయినా తమిళ సినీ పరిశ్రమంలో సెటిల్ అయ్యారు. తమిళంలోనే కాక తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా ఆయన నటించారు. అయితే ఆయన మరణం తర్వాత ఆయన గురించి తెలుగు దర్శకులు ఒకరు తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఒక సుదీర్ఘ పోస్ట్ ఆసక్తి రేకెత్తిస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే

గ్రే సినిమా

గ్రే సినిమా

తెలుగు సినీ పరిశ్రమలో రాజు మాదిరాజు అనే పేరు గురించి తెలియని వారు ఉండరు. జానికి ఆయన దాసరి నారాయణరావు వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా తన కెరీర్ ప్రారంభించి దర్శకుడిగా మారారు. కానీ నటుడిగా ఆయన ఎక్కువమందికి పరిచయం. పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరి ఆంధ్రాపోరి సినిమాతో హీరోగా లాంచ్ అయింది ఆయన చేతుల్లోనే. అంతకంటే ముందే అంకుల్ అనే సినిమా తర్వాత రిషి, పైరేట్స్ 1.0, అయితే 2.0 అనే సినిమాలు రాజ్ మాదిరాజు దర్శకుడిగా తెరకెక్కించారు. తాజాగా ఆయన గ్రే అనే సినిమా దొరికించగా అది విడుదలకు సిద్ధమవుతోంది.

ప్రొఫెసర్ పాత్ర

ప్రొఫెసర్ పాత్ర

ఈ సినిమాలో ప్రతాప్ పోతన్ నటించడంతో ఆయనతో వర్క్ ఎక్స్ పీరియన్స్ గురించి రాజ్ పంచుకున్నారు. మా జనరేషన్ సినిమా ఆడియెన్సుకి, ముఖ్యంగా సినిమా పిచ్చోళ్ళకి బాగా తెలిసిన నటుడు.. ఒక విధమైన క్రేజీ ఎక్సెంట్రిక్ సైకోటిక్ ప్రవర్తన ఉన్న పాత్రలలో భలే ఇమిడిపోయేవాడు.. గ్రే సినిమాలో ప్రొఫెసర్ పాత్ర రాసుకుంటూండగా ఆయనే మొదట మెదిలిందని అన్నారు.

పోట్లాడేవారు

పోట్లాడేవారు

ఆయననే ఎదురుగా పెట్టుకుని రాసుకుని పూర్తి కాగానే ఆయనకు ఫోనులో వినిపించాను.. చాలా ఇష్టపడ్డారాయన.. తన పాత్రని, సినిమాని, నా టీముని, తన సహ నటీనటులను.. స్వతహాగా దర్శకుడు కూదా అవడంతో సెట్లో లెన్సు, లైటింగు గురించి మాట్లాడేవారు.. పోట్లాడేవారు.. ఎదురు చెప్పబోతే ఈసడించుకునేవారు.. ఈర్ష్యపడేవారు.. పూర్తయాక చూసి సరేలే అని వెళ్ళిపోయేవారని అన్నారు.

జెమ్ ఉంది

జెమ్ ఉంది

ఉదయం ఆరున్నరకి లొకేషనుకొస్తే ప్యాకప్ అయేంతవరకూ అలాగే కూర్చుని ఉండేవారని అన్నారు. ఒకరోజు దాదాపు ముఫ్ఫయ్యారుగంటలు నాన్-స్టాప్ షూటింగు చేశామని, ఆయన బట్టలనిండా, వొంటినిండా రక్తం పెట్టుకుని ఆరిపోతోంటే మళ్ళీ మళ్ళీ తడిచేసుకుంటూ అలాగే ఉన్నారని అప్పటి సంగతులు పంచుకున్నారు. ఇక ఆయన తిరిగి వెళ్ళిపోయాక సినిమా, ట్రెయిలరు రెండూ పంపించానని అన్నారు. "నీ చేతిలో ఒక జెమ్ ఉంది రాజ్.. జాగ్రత్తగా ప్రమోషన్ చేయండి.." అని డిజిటల్ మార్కెటింగ్ ఎలా ఉండాలో పది పన్నెండు అయిడియాలు కూడా చెప్పారని అన్నారు.

ఫ్రీగా యాక్ట్ చేస్తా

ఫ్రీగా యాక్ట్ చేస్తా

డెభ్భయ్యేళ్ల వయసులో ఆయన ఉత్సాహం, కమిట్‌మెంటు చూస్తే గొప్పగా అనిపించిందని రాజ్ అన్నారు. ఆఖరుసారిగా ఆయన నాతో అన్నమాట.. ట్రెయిలరు చూశాక ఎగ్జైటెడుగా.."నాకోసం ఒక కథ తయారుచెయ్యి రాజ్.. ఫ్రీగా యాక్ట్ చేస్తా.." అని అన్నారని ఆ విషయాన్నీ చెబుతూ ఎమోషనల్ అయ్యారు. ఇక ప్రతాప్ పోతన్ మృతి నేపథ్యంలో పలువురు ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X