ఎవరి వల్ల ఇబ్బంది పడలేదు కానీ..నెపోటిజంపై రాజ్ తరుణ్ కామెంట్స్..

యువ హీరో రాజ్ తరుణ్ మొదట షార్ట్ ఫిలిమ్స్ తో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని ఆ తరువాత టాలీవుడ్ హీరోగా మంచి క్రేజ్ అందుకున్న విషయం తెలిసిందే. ఎలాంటి సినిమా చేసినా కూడా తన నటనతో సరికొత్తగా ఆకట్టుకునే రాజ్ తరుణ్ కెరీర్ లో మొదటిసారి తన సినిమాను డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేస్తున్నాడు. ఆహా యాప్ లో ఒరేయ్ బుజ్జిగా నేడు విడుదలైంది. ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రాజ్ తరుణ్ నెపోటిజమ్ పై అలగే తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలను బయటపెట్టాడు.

ఎవరి వల్ల ఇబ్బంది పడలేదు

ఎవరి వల్ల ఇబ్బంది పడలేదు

రాజ్ తరుణ్ మాట్లాడుతూ.. మొదట సినిమా అనేది నాకు ఎంతో అభిమానం. అందుకే షార్ట్ ఫిల్మ్ లో నటించా. ఆ తరువాత ఒక సహాయక దర్శకుడి స్టేజ్ నుంచి అనుకోకుండా హీరోగా మరాను. ఎవరి వల్ల కూడా ఇండస్ట్రీలో ఇబ్బంది పడిన సందర్భాలు లేవు. ముఖ్యంగా బంధుప్రీతి కారణంగా చిన్న అవకాశం కూడా మిస్ అవ్వలేదు.

టాలెంట్ ఉన్న వాళ్ళకే అవకాశాలు

టాలెంట్ ఉన్న వాళ్ళకే అవకాశాలు

ఎలాంటివారైనా సరే ఇండస్ట్రీలో కష్టపడక తప్పదు. నేను కూడా ఇక్కడ నిలదొక్కుకోవాలి అంటే వీలైనంత ఎక్కువగానే కష్టపడాలని అర్ధమయ్యింది. టాలెంట్ ఉన్నవారికే ఇక్కడ ఎక్కువ అవకాశాలు వస్తుంటాయి. సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్నా లేకున్నా మన టాలెంట్ నచ్చితే ఎవరైనా అవకశాలు ఇవ్వగలరని చెప్పగలను.

డైరెక్టర్ అవ్వాలని అనుకున్నా

డైరెక్టర్ అవ్వాలని అనుకున్నా

నాకు మొదట డైరెక్టర్ అవ్వాలని ఆశగా ఉండేది. కథలు కూడా రాసుకున్నాను. రైటింగ్ అంటే చాలా ఇష్టం. ఎదో ఒకరోజు తప్పకుండా సినిమా తీయాలని అనుకునేవాడిని. కానీ ఇపుడు అలాంటి ఆలోచనలు లేవు. నా దృష్టి మొత్తం నటనమిదే ఉంది. ఒరేయ్ బుజ్జిగా సినిమా తీసిన దర్శకుడు విజయ్ కుమార్ కొండాతో నాకు మంచి స్నేహం ఉంది.

Recommended Video

Orey Bujjiga Movie Team Interview Part 3 | Naresh, Posani Contribution To The Movie
మరోసారి ఆ దర్శకుడితో కొత్త సినిమా

మరోసారి ఆ దర్శకుడితో కొత్త సినిమా

ఒరేయ్ బుజ్జిగా సినిమా సమయంలోనే ఆ దర్శకుడి టాలంటే ఏమిటో నాకు చాలా క్లియర్ గా అర్థమైంది. ఆయనతో మరో సినిమా కూడా చేస్తున్నాను. ఇటీవల మోదలైనన ఆ షూటింగ్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇక మరో కొత్త దర్శకుడితో కూడా ఒక డిఫరెంట్ సినిమా చేస్తున్నాను. లాక్ డౌన్ లో అయితే చాలా కథలు విన్నాను. చర్చల దశలో ఉన్న ఆ కథలు ఫైనల్ కాగానే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఇస్తాను.. అని రాజ్ తరుణ్ వివరణ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X