twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాజ్ తరుణ్ మళ్లీ మొదలెట్టేశాడు.. ఫొటో పోస్ట్ చేసి మరీ చూపించాడు

    |

    కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ శివారు ప్రాంతమైన నార్సింగ్ పరిధిలోని అల్కాపూర్ వద్ద హీరో రాజ్ తరుణ్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగిన వెంటనే హీరో తరుణ్ కారు అని వార్తలు వచ్చాయి. వీటిని అతడు ఖండించడంతో, తర్వాత మరో యంగ్ హీరో రాజ్ తరుణ్ పేరు తెరపైకి వచ్చింది. అదే సమయంలో సీసీ టీవీ పుటేజ్‌ కూడా బయటకు వచ్చింది. దీంతో తర్వాతి రోజు అతడు సోషల్ మీడియా వేదికగా యాక్సిడెంట్‌ జరిగింది తనకేనని వెల్లడించాడు.

    అంతేకాదు, యాక్సిడెంట్ జరిగిన తర్వాత పారిపోవడంపై ప్రత్యేకంగా వివరణ ఇచ్చాడు. 'నేను క్షేమంగానే ఉన్నాను. నాకోసం ప్రార్ధించిన వారందరికీ ధన్యవాదాలు. ప్రమాదం జరిగిన తర్వాత కారు నుంచి కిందికి దిగాను. కారును చూశాను. నాకేమైనా గాయాలయ్యాయేమోనని చూసుకున్నాను. ఆ వెంటనే ఎవరి సహాయమైనా తీసుకుందామన్న ఉద్దేశ్యంతో అక్కడి నుంచి వేగంగా పారిపోయాను. ఆ యాక్సిడెంట్ సమయంలో జరిగింది అంతా ఇదే' అని అతడు చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత ఈ కేసు ఎన్నో మలుపులు తిరిగింది. ఇందులో అతడిని పోలీసులు అరెస్ట్ కూడా చేసిన విషయం తెలిసిందే. అనంతరం స్టేషన్ బెయిల్‌పై రాజ్ తరుణ్‌ను విడుదల చేశారు.

    View this post on Instagram

    #shotgapselfie #iddharilokamokatae

    A post shared by Raj Tarun (@rajtarunn) on

    Raj Tarun Attends Iddhari Lokam Okate Shooting

    ఈ సంఘటన నుంచి బయటకు వచ్చిన రాజ్ తరుణ్ షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. ప్రస్తుతం రాజ్ తరుణ్.. దిల్ రాజు నిర్మిస్తున్న 'ఇద్దరి లోకం ఒకటే' అనే సినిమాలో నటిస్తున్నాడు. దీనికి జీఆర్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌లోనే అతడు పాల్గొన్నాడు. దీనికి సంబంధించిన సెల్ఫీని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన రాజ్ తరుణ్.. 'షాట్ గ్యాప్‌లో చిన్న సెల్ఫీ' అని క్యాప్షన్ పెట్టాడు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    English summary
    Raj Tarun has acted in 52 short films, and dreamt of becoming a film director. He also worked on the screenplay and dialogues for his first film Uyyala Jampala. In 2015, he acted in Cinema Choopistha Mava and Kumari 21F.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X