యాక్సిడెంట్ అప్‌డేట్: పారిపోతూ సీసీ కెమెరాలకు చిక్కన రాజ్ తరుణ్‌.. ప్రమాదంపై అనుమానాలు

Recommended Video

పారిపోతూ సీసీ కెమెరాలకు చిక్కన రాజ్ తరుణ్‌

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్‌ కారుకు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. మొదట ఈ ప్రమాదం తరుణ్‌కు జరిగిందని ప్రచారం జరిగింది. అయితే, కొన్ని సంస్థలు మాత్రమే రాజ్ తరుణ్ అని పేర్కొన్నాయి. ఆ తర్వాత హీరో తరుణ్ కూడా దీనిపై స్పందించాడు. తనకు ఎటువంటి ప్రమాదం జరగలేదని, తాను రాత్రి నుంచి ఇంట్లోనే ఉన్నానని పేర్కొన్నాడు. అయితే, తాజాగా ఈ ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ బయటకు వచ్చాయి.

ప్రమాదం జరిగిందిలా..!

రాజ్ తరుణ్‌ తన కారులో హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. TS09 Ex 1100 నంబర్ గల తన కారులో వస్తుండగా నార్సింగ్ పరిధిలోని అల్కాపూర్ దగ్గర కుడి వైపు మలుపు ఉంది. అక్కడ కారును రైట్ టర్న్ తిప్పకుండా ఎదురుగా ఉన్న గోడను ఢీకొట్టాడు. దీంతో కారు అక్కడి నుంచి ముదుకు దూసుకుపోయింది కారు బాగా ద్వంసం అయింది.

పారిపోతూ కెమెరాలకు చిక్కాడు

పారిపోతూ కెమెరాలకు చిక్కాడు

ప్రమాదం జరిగిన తర్వాత రాజ్ తరుణ్ అక్కడి నుంచి పారిపోయాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు పక్కనే ఉన్న సీసీ కెమెరాకు చిక్కాయి. ఇందులో అతడు మొదట నడుచుకుంటూ వెళ్లాడు. ఆ తర్వాత పరిగెత్తడం ప్రారంభించాడు. అదే సమయంలో చేతిలో ఫోన్ తీసుకుని చూస్తున్న దృశ్యం కనిపించింది. అయితే, అతడు ఎటువైపు వెళ్లాడు..? ఎందుకు పారిపోయాడు..? అనేది మాత్రం తెలియడం లేదు.

అతివేగమా..? నిద్ర మత్తా..?

అతివేగమా..? నిద్ర మత్తా..?

తెల్లవారుజామున ఈ ప్రమాదం జరగడంతో నిద్రమత్తు వల్లే జరిగి ఉంటుందని అంతా అనుకున్నారు. ఆ తర్వాత అతి వేగం వల్ల నడపడంతోనే ఈ ప్రమాదం జరిగిందని వార్తలు వచ్చాయి. అయితే, ప్రమాదం జరిగిన తీరు గమనించిన తర్వాత రాజ్ తరుణ్ మద్యం మత్తులో ఉన్నాడన్న టాక్ వినిపిస్తోంది. దీనిపై పోలీసులు కూడా ఏమీ తేల్చలేకపోతున్నారు.

 రాజ్ తరుణ్‌ ఎక్కడ..?

రాజ్ తరుణ్‌ ఎక్కడ..?

ప్రమాదం జరిగిన తర్వాత రాజ్ తరుణ్‌ చిన్న చిన్న గాయాలతో స్వయంగా బయటకు వచ్చాడని స్థానికులు చెప్పారు. అయితే, వీడియోలో మాత్రం అతడు పరిగెత్తడం చూస్తే ఎటువంటి గాయాలు కాలేదని అర్థం అవుతోంది. మరి తెల్లవారుజాము నుంచి అతడు ఎక్కడ ఉన్నాడు..? అనేది మాత్రం తెలియడం లేదు. దీంతో ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X