యాక్సిడెంట్ అయినప్పుడు తాగున్నావా..? అని అడిగితే రాజ్ తరుణ్ ఏం చెప్పాడో చూడండి
రెండు రోజుల క్రితం హైదరాబాద్ శివారు ప్రాంతమైన నార్సింగ్ పరిధిలోని అల్కాపూర్ వద్ద ఓ కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగిన వెంటనే హీరో తరుణ్ కారు అని వార్తలు వచ్చాయి. వీటిని అతడు ఖండించడంతో, తర్వాత మరో యంగ్ హీరో రాజ్ తరుణ్ పేరు తెరపైకి వచ్చింది. అదే సమయంలో సీసీ టీవీ పుటేజ్ కూడా బయటకు వచ్చింది. అందులో కారు దిగి పారిపోతున్న వ్యక్తి రాజ్ తరణ్‌లా ఉండడంతో ఈ వార్తలకు బలం చేకూరినట్లైంది. ఇక, బుధవారం ఈ ప్రమాదంపై హీరో రాజ్ తరుణ్ స్పందించిన విషయం తెలిసిందే.
యాక్సిడెంట్ తర్వాత పారిపోవడంపై ప్రత్యేకంగా వివరణ ఇచ్చాడు. 'నేను క్షేమంగానే ఉన్నాను. నాకోసం ప్రార్ధించిన వారందరికీ ధన్యవాదాలు. ప్రమాదం జరిగిన తర్వాత కారు నుంచి కిందికి దిగాను. కారును చూశాను. నాకేమైనా గాయాలయ్యాయేమోనని చూసుకున్నాను. ఆ వెంటనే ఎవరి సహాయమైనా తీసుకుందామన్న ఉద్దేశ్యంతో అక్కడి నుంచి వేగంగా పారిపోయాను. ఆ యాక్సిడెంట్ సమయంలో జరిగింది అంతా ఇదే' అని అతడు చెప్పుకొచ్చాడు.

ఇక, గురువారం ఇదే విషయంపై మాట్లాడడానికి రాజ్ తరుణ్ ట్విట్టర్‌లో అభిమానులతో చిట్ చాట్ చేశాడు. ఈ సందర్భంగా 'ప్రమాదం జరిగినప్పుడు మద్యం సేవించి ఉన్నారా' అని చాలా మంది అతడిని ప్రశ్నించారు. అందులో ఒకరికి నో అని సమాధానం ఇచ్చాడు. మధ్యలో మరో నెటిజన్ 'డ్రింక్ చేస్తే మాత్రం చేసాం అని చెప్తారా ఏంటి' అని వ్యంగ్యంగా అన్నాడు. దీనికి 'యాక్సిడెంట్ అయ్యి బాధ పడితే.. గోరు చుట్టు మీద రోకలి పోటు ఏంటి భయ్యా' అంటూ రాజ్ తరుణ్ రిప్లై ఇచ్చాడు. దీంతో ఈ ట్వీట్ చర్చనీయాంశం అవుతోంది.


Click it and Unblock the Notifications











