రాజ్ తరుణ్ కు నచ్చలేదట, కాని విజయ్ దేవరకొండకు నచ్చింది !
''పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి'' చిత్రాలతో నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం 'టాక్సీవాలా'. జిఏ 2, యువి పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఎస్ కె ఎన్ నిర్మాత. రాహుల్ సంకృత్యాన్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. మే 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
తాజాగా విడుదలైన ఈ సినిమా టీజర్ కు మంచి రెస్పాన్స్ లభించింది. 'అర్జున్ రెడ్డి' చిత్రంతో విజయ్ దేవరకొండకి యూత్‌లో క్రేజ్ ఎలా పెరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఆ క్రేజ్ టాక్సివాల సినిమాకు ఉపయోగపడుతోంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండా ఈ సినిమాతోపాటు పరుశురం బుజ్జి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటు తమిళ్, తెలుగు నోటా సినిమాలో నటిస్తున్నాడు.

తాజాగా ఈ సినిమా గురించి ఒక వార్తా వినిపిస్తోంది. ఒక హీరో చేయవలసిన సినిమాను కొన్ని కారణాల వలన మరో హీరో చేయడం మనం చాలా సందర్భాలో చూసాం. రాజ్ తరుణ్ చెయ్యాల్సిన టాక్సీవాలా సినిమాను విజయ్ దేవరకొండ చేసినట్లు సమాచారం. రాజ్ తరుణ్ కు ఈ పాయింట్ నచ్చకపోవడంతో తప్పుకున్నాడని, విజయ్ దేవరకొండకు ఈ సినిమా నచ్చిందని సమాచారం.


Click it and Unblock the Notifications











